మీ ఫోన్లో డేటా త్వరగా అయిపోతుందా.. అయితే ఈ సెట్టింగ్ చేయండి..!
Mobile Data Saving settings : Does your phone run out of data quickly.. but do this setting..!
Mobile Data Saving techniques: When we buy a smartphone, there are apps in that phone. Apart from them, we keep downloading some other apps that we need. But some of them we use once in a while, others we don't use, like this our phone memory gets filled up by the apps we don't use, our finger accidentally touches the apps, our mobile data gets wasted due to apps running in the background. This way the data for the day runs out very quickly.
Mobile Data Saving techniks : మనం స్మార్ట్‌ఫోన్ కొనేటపుడు ఆ ఫోన్ లో కొని యాప్స్ ఉంటాయి. అవి కాకుండా మనకవసరమయ్యే ఇంకొన్ని యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. కానీ అందులో కొన్ని ఎపుడో ఒకసారి వాడుతాము, మరికొన్ని వాడము ఈ విదంగా మనం ఉపయోగించని యాప్స్ ద్వారా మన ఫోన్ మెమరీ నిండిపోవడం, అప్స్ ఫై మన వేలు అనుకోకుండా టచ్ కావడం వల్ల, బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ రన్ కావడం వల్ల మన మొబైల్ డేటా వెస్ట్ అవుతూ ఉంటుంది. ఈ విదంగా ఆ రోజుకి డేటా చాల తొందరగా అయిపోతుంది.
ఈ విధమైన డేటా లాస్ కాకుండా ఉండటానికి కొన్ని టెక్నిక్స్ మీకోసం…
స్మార్ట్ ఫోన్ లో మనకు ఉపయోగపడని యాప్స్ ని తొలగించాలి. లేదంటే బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ రన్ కావడం వల్ల డేటా లాస్ అవుతాము. ఈ యాప్స్ తొలగించడం ద్వారా మనం డేటాను సేవ్ చేసుకోవచ్చు. అవసరమున్నపుడు మాత్రమే డేటాను ఆన్ చేసుకోవాలి . 24 గంటలు ఆన్ లో ఉంచకూడదు. అలాగే డీఫాల్ట్ గా వీడియోస్ డౌన్లోడ్స్ కాకుండా సెట్టింగ్ చేసుకోవాలి.
ఇంకా స్మార్ట్ ఫోన్‌లో ఉన్న కొన్ని ఆప్షన్లను ఉపయోగించి డేటాను తొందరగా అయిపోకుండా చూసుకోవచ్చు. అవేంటో ఇపుడు చూద్దాం.
‘ఆండ్రాయిడ్ సెట్టింగ్స్’లో ‘నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్’ అనే ఆప్సన్స్ లోకి వెళ్లి అందులో ఉండే ‘Data Saver’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే డేటా కంప్రెస్ చేయడంతో.. డేటా ని సేవ్ చేసుకోవచ్చు.
అదేవిదంగా ‘App Data Usage’ అనే ఆప్షన్ ను ఎన్నుకొని ‘Background Data’ను డిజేబుల్ చేయడం వల్ల మీరు ఎంచుకున్న యాప్‌నకు డేటా వినియోగానికి పరిమితి విధించవచ్చు.
ఇక కొన్ని ఫోన్లలో ‘Unrestricted Data’ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని గనక డిజేబుల్ చేసుకుంటే డేటా ఆదా అవుతుంది. ఇలా కొన్ని చిన్ని చిన్న ట్రిక్స్ పాటించడం తో మీ మొబైల్ డేటాను సేవ్ చేసుకోవడం , మీకు 30 రోజులకు ఎంత డేటా వినియోగిస్తారో తెలుసుకొని , దానికి తగ్గట్టు రీఛార్జ్ చేసుకొని డబ్బులు ఆదా చేసుకోవచ్చు.