ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు - ఓటర్లకు చంద్రబాబు పిలుపు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు - ఓటర్లకు చంద్రబాబు పిలుపు!

Chandrababu: The anti-government vote should not be split in the MLC elections - Chandrababu's appeal to the voters!

Chandrababu: The anti-government vote should not be split in the MLC elections - Chandrababu's appeal to the voters!

Chandrababu: Telugu Desam Party chief Chandrababu called that the anti-government vote should not be split in the MLC elections. That is why Telugudesam, which is contesting in graduate elections, has come to an understanding with PDF. He asked the people and the supporters of Telugu Desam to give first preference vote to TDP and second preference vote to PDF candidates in MLC elections for matriculation seats. Voters who voted for the PDF candidates were advised to give their second preference vote to the Telugu Desam Party. The evil YSRCP should not win by splitting the vote. That is why there should be a mutual exchange in the case of the second preference vote.

Chandrababu :     ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.  అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం.. పీడీఎఫ్‌తో ఒక అవగాహనకు వచ్చిందన్నారు. పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి.. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, తెలుగుదేశం మద్దతుదారులను కోరారు.   పీడీఎఫ్ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని సూచించారు.  ఓటు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైఎస్ఆర్‌సీపీ గెలవకూడదన్నారు.  అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉందన్నారు.

పతనం అంచులో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో, చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు, టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూంరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.   

రాష్ట్ర విభజన తర్వాత  ఏపీ పగ్గాలు చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించిందన్నారు.  క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు.   నాడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత భవితకు బాటలు వేశామని చంద్రబాబు గుర్తు చేశారు.  నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి.. నిరుద్యోగం పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ గురించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అంతా గ్రహించాలని పిలుపునిచ్చారు.  నాడు విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని  ఉద్యోగులకు తెలిపారు.                       

నేడు ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా.. కనీసం ఏనెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా లేదు. టీచర్లకు లిక్కర్ షాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో టీచర్లు బుద్ధి చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైకాపా తెరతీసింది. దొంగ అడ్రస్‌లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే 7వేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీ అక్రమాలకు ఎదురొడ్డి.. నిలబడి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సి ఉందని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.