Agniveer Recruitment 2023

Agniveer Recruitment 2023

Agniveer Recruitment: అగ్నివీర్ నియామకాలు.. మార్చి 17 నుంచి దరఖాస్తులు..

Agniveer Recruitment 2023

Agniveer Recruitment: మార్చి 17 నుంచి అగ్నివీర్ నియామాకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రాసెస్ అనేది మార్చి 31న ముగియనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తుల ప్రక్రియ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా మార్చి 31 నిర్ణయించారు. మే 20 నుంచి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను agnipathvayu.cdac.in లో సమర్పించగలరు.అవివాహిత భారతీయ పురుష మరియు స్త్రీ అభ్యర్థుల నుండి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానించబడతాయి.

వయస్సు పరిధి

అభ్యర్థులు 26 డిసెంబర్ 2002 మరియు 26 జూన్ 2006 మధ్య జన్మించి ఉండాలి. విద్యార్హత గురించి చెప్పాలంటే.. సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మొత్తం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తారు. తర్వాత శిక్షణకు ఎంపిక చేస్తారు.

వీటితో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. చేసుకోవడానికి మార్చి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు https://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని దశల్లో అర్హతలు సాధించిన వారిని నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు.

అర్హతల వివరాలు..

1) అగ్నివీర్ జనరల్ డ్యూటీ

అర్హత: అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ సైతం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

2) అగ్నివీర్ టెక్నికల్

అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. టెన్త్ తో పాటు రెండేళ్ల ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 17.5 - 21 ఏళ్ల మధ్య ఉండాలి.

3) అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ (టెక్నికల్)

అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంకా.. ఒక్కో సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

4) అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్

అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 17.5 - 21 ఏళ్ల మధ్య ఉండాలి.

5) అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8Th Pass)

అభ్యర్థులు 8వ తరగతి పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 17.5 - 21 ఏళ్ల మధ్య ఉండాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.