రైల్వే ఈ-టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ.. నోటితో చెబితే చాలు టికెట్ బుక్ అయిపోతుంది.. వివరాలు తెలుసుకోండి
IRCTC: Railway e-ticket booking is now very easy.. Just say it by mouth and the ticket will be booked.. Know the details
Indian Railways: Railway Department is updating. It is advancing by introducing new technology from time to time. The company, which is already providing better facilities through the IRCTC app, is trying to bring more reforms in the online ticket booking system. IRCTC, which has already launched a chatbot named 'Ask Disha' (Digital Interaction to Seek Help Anytime) to resolve customer queries, is now working hard to connect this chatbot with state-of-the-art artificial intelligence (AI). Through this, the passenger is given the facility to book the ticket easily by giving a command orally. This is called voice centric e-ticketing. Let's see the full details about this now..
To speed up
An average passenger spends a lot of time to book a train ticket online. They have to log on to the IRCTC website, enter the passenger's name and other details in the form and submit it. This wastes a lot of time. As a result, when we start trying to book the ticket, even though the seat is vacant, by the time we complete the form and make the payment, it goes to the waiting list. Efforts have been started to bring advanced artificial intelligence to solve this. A ticket can be booked by telling your details orally.
Indian Railways: రైల్వే శాఖ అప్‌డేట్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా మెరుగైన సౌకర్యాలను అందిస్తున్న సంస్థ.. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వినియోగదారుల సందేహాల నివృత్తి కోసం ‘ఆస్క్ డిశా’(డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం) పేరుతో చాట్ బాట్‌ను ఆవిష్కరించిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు ఈ చాట్ బాట్ అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను అనుసంధానించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ప్రయాణికుడు నోటితో కమాండ్ ఇవ్వడం ద్వారా ఈజీగా టికెట్ బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనిని వాయిస్ సెంట్రిక్ ఈ-టెకెటింగ్ అని అంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వేగవంతం చేసేందుకు..
ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ను బుక్ చేయడానికి సగటు ప్రయాణికుడికి చాలా సమయం వృథా అవుతోంది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి, అందులోని ఫారమ్‌లో ప్రయాణికుల పేరు, ఇతర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి వస్తోంది. దీని వల్ల చాలా సమయం వృథా అవుతోంది. ఫలితంగా మనం టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నం ప్రారంభించినప్పుడు సీటు ఖాళీ కనిపించినా.. ఈ ఫారం అంతా పూర్తి చేసి పేమెంట్‌చేసే సమయానికి వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్లిపోతోంది. దీనిని పరిహరించేందుకు అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మీ వివరాలు నోటితో చెప్పడం ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
పరీక్షలు ప్రారంభం..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన వాయిస్ సెంట్రిక్ ఈ-టెకెటింగ్ విధానాన్ని ఐఆర్‌సీటీసీ ఇప్పటికే పరీక్షించడం ప్రారంభించింది. పలు నివేదికల ప్రకారం తొలి దశ పరీక్షలు విజయవంతం అయ్యాయి. మరికొన్ని దశల పరీక్షలు నిర్వహించనున్నారు. అన్నీ కుదిరితే వచ్చే మూడు నెలల్లోపు వాయిస్ ఆధారిత టికెట్ బుకింగ్ ని ఆవిష్కరించేందుకు ఐఆర్‌సీటీసీ కసరత్తు చేస్తోంది.
ఆస్క్ దిశా 2.0 ఫీచర్లు
- చాట్‌బాట్ ‘ఆస్క్ దిశ 2.0’ సహాయంతో ప్రయాణికులు టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. దీని కోసం కస్టమర్‌లు టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్‌లను ఉపయోగించాలి.
- ఈ ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్ తన టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చు. మీరు రద్దు చేసిన టికెట్ల వాపసు స్థితిని కూడా చూడవచ్చు.
- మీరు మీ పీఎన్‌ఎర్ స్థితిని కూడా చూడవచ్చు.
- ఈ ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికులు తాము ఎక్కే స్టేషన్‌ను మార్చుకోవచ్చు. అలాగే డెస్టినేషన్ స్టేషన్‌ని కూడా మార్చుకోవచ్చు.
- ఇక్కడ మీరు రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ చేయవచ్చు.
- రైలు ప్రయాణానికి సంబంధించిన ఏదైనా ప్రశ్నకు ఈ ప్లాట్‌ఫారమ్‌లో సమాధానం దొరకుతుంది.
- ఈ చాట్‌బాట్ హిందీ లేదా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడగవచ్చు. ఇంగ్లిష్‌లో అయితే ‘యాక్చువల్లీ’ అనే పదంతో చాటింగ్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది.

