PM Kisan Samman Nidhi Yojana

 PM Kisan Samman Nidhi Yojana

PM Kisan Samman Nidhi Yojana: అన్నదాతలకు గుడ్‏న్యూస్.. ఈరోజే అకౌంట్లోకి డబ్బులు.

PM Kisan Samman Nidhi Yojana

రైతులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా దేశంలోని కోట్లాది మంది రైతుల నిరీక్షణకు నేటితో తెరపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్క్రీమ్ కింద అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నానున్నాయి. పీఎం కిసాన్ స్క్రీమ్ 13వ విడత నగదును ఈరోజు సోమవారం 8 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 16,800 కోట్ల మొత్తాన్ని ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2000 చొప్పున అందించనున్నారు. ఏడాదిలో మూడు విడతలుగా సంవత్సరానికి రూ. 6వేలు అందిస్తుంది ప్రభుత్వం. ఈ పథకాన్ని 2019లో అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం.

సోమవారం కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. బెలగావి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 13వ విడత డబ్బులను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ లబ్దిదారులతో సహా సుమారు లక్ష మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనాలు. ప్రధాని మోదీతోపాటు.. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా హాజరుకానున్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్క్రీమ్ పథకంలో భాగంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2.25 లక్షల కోట్లు పంపిణీ చేసింది. ఇందులో కోవిడ్-19 కాలంలో రైతులకు అనేక విడతలుగా రూ.1.75 లక్షల కోట్లు అందించారు.

పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే..

1. ముందుగా https://pmkisan.gov.inకి లాగిన్ కావాలి.

2. ఆ తర్వాత ‘ఫార్నర్ కార్నర్ ‘పై క్లిక్ చేయాలి.

3. ‘ఫార్నర్ కార్నర్ ‘లో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి.

4. అనంతరం మీ రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామాన్ని సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.

5. ఆ తర్వాత ‘గెట్ రిపోర్ట్’ పై క్లిక్ చేయాలి.

6. అనంతరం అన్ని వివరాలతో లబ్దిదారుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.