BSF Recruitment 2023: పదో తరగతి అర్హతతో బీఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు..

BSF Recruitment: Jobs in BSF with 10th class qualification
BSF Recruitment: Jobs in BSF with 10th class qualification

BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు..

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉండే ఈ విభాగంలో భారీగా పోస్టునుల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1284 కానిస్టేబుల్‌(ట్రేడ్స్‌మెన్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పురుషులు (1220), మహిళలు (64) ఉన్నాయి. కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్‌, వెయిటర్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌/ పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 27-03-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

For notification checkhere

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.