Unified Pension Scheme Calculator
UPS కాలిక్యులేటర్: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్.. UPS క్యాలిక్యులేషన్ ఫార్ములా ఇదే.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే మరో నెల రోజుల్లోనే యూపీఎస్ అమలవుతుంది.
దీంతో ఈ స్కీమ్ కింద రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఎస్ క్యాలిక్యులేటర్, ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఒక ఆప్షన్‌గా ప్రవేశపెట్టింది. దీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్‌కు హామీ పొందవచ్చు. NPS అనేది మార్కెట్-లింక్డ్ పెన్షన్ స్కీమ్. దీని పే అవుట్ ఈక్విటీ, డెట్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. యూపీఐ కింద ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.10వేలు అందుతుంది. కనీసం 10 సంవత్సరాల సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు స్కీమ్‌లో పెన్షన్‌కు హామీ ఉంటుంది. NPS కింద ఉన్న ఉద్యోగులు ఒక్కసారి UPSని ఏంచుకుంటే, ఆ తర్వాత, వారు తిరిగి NPSకి వెళ్లలేరు.
UPS కాలిక్యులేటర్: UPS కింద పెన్షన్‌ను ఎలా లెక్కించాలనేది ఒక ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. అదేంటంటే
పే అవుట్ = 50% x (గత 12 నెలల బేసిక్ పే/12)
మీ సేవ 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ఇది వర్తిస్తుంది. మీ సర్వీస్ 25 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, పే అవుట్ అనేది ప్రపోర్షనేట్‌గా ఉంటుంది. ఒక ఉద్యోగి 25 సంవత్సరాల తర్వాత స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తే, ఒరిజినల్ సూపర్ యాన్యుటేషన్ తేదీ నుంచి పే అవుట్ చేయబడింది. దీన్ని 3 సందర్భాలు, ఉదాహరణలతో చూద్దాం.
కేసు 1: ఫుల్ అస్యూర్డ్ పే అవుట్ (25+ సంవత్సరాల సర్వీస్): పదవీ విరమణ సమయంలో ఒక ఉద్యోగి యావరేజ్ బేసిక్ పే రూ. 12,00,000 ఉందనుకున్నాం. యూపీఎస్ సూత్రం ప్రకారం, ఈ 12తో భాగించాలి. అప్పుడు గత 12 నెలల యావరేజ్ బేసిక్ పే రూ.1,00,000 అవుతుంది. ఇప్పుడు దీన్ని 50 శాతంతో గుణించాలి. ఈ లెక్కన ఉద్యోగికి రూ.50,000 పెన్షన్ అందుతుంది.
కేసు 2: దామాషా (అనుపాతంలో) పే అవుట్ (25 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్): ఈ సందర్భంలో ఫార్ములాకు ప్రపోర్షనేట్ ఫ్యాక్టర్‌ను కూడా యాడ్ చేయాలి. ఎవరైనా 20 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశారనుకుందాం. అప్పుడు, ప్రపోర్షనేట్ ఫ్యాక్టర్ 20/25 = 0.8 అవుతుంది. కాబట్టి పే అవుట్ క్యాలిక్యులేషన్ 50% x 1,00,000 x 0.8 = రూ. 40,000 అవుతుంది.
కేసు 3: మినిమం గ్యారంటీడ్ పే అవుట్: రిటైర్మెంట్ టైంకి ఎవరికైనా రూ.15,000 బేసిక్ పే ఉంటే, వారి పే అవుట్ రూ. 7,500 అవుతుంది. కానీ ఇది స్కీమ్ కింద హామీ ఉంటే కనీస పెన్షన్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో వారి ఫైనల్ పేఅవుట్ రూ. 10,000 చేస్తారు.