Let's find out whether it is possible to track the location through a WhatsApp call.
Whatsapp: ఏంటి వాట్సాప్ కాల్ ద్వారా లొకేషన్ ను ట్రాక్ చేయవచ్చా.. అదెలానో తెలుసుకుందాం.
వాట్సాప్ వినియోగిస్తున్న చాలామందికి అందులో ఉండే కొన్ని ఫీచర్ల గురించి అసలు తెలియదు. కేవలం కొన్ని ఫీచర్లను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరికి తెలియని సీక్రెట్ ఫీచర్స్ వాట్సాప్ లో చాలానే ఉన్నాయి.
వాటిలో మీ వాట్సాప్ కాల్ ను లొకేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు అన్న విషయం కూడా ఒకటి. కాలింగ్ సమయంలో మీ ఐడి చిరునామాను ట్రాక్ చేయవచ్చు. కాలింగ్ సమయంలో వినియోగదారులు ఉన్న లొకేషన్‌ను ఎవరూ గుర్తించకుండా ఉండేలా వాట్సాప్ లో ట్రిక్ ఉంది. ఇది వాట్సాప్ వినియోగదారుల భద్రతను పెంచుతుందట.
అయితే వాట్సాప్ లో రహస్య ఈ ఫీచర్ గురించి కూడా తెలియని వినియోగదారులు చాలా మందే ఉన్నారు. వాట్సాప్ కాల్ ల సమయంలో మీ లొకేషన్ ను ఏ హ్యాకర్ లేదా స్కామర్ గుర్తించకుండా ఉండాలంటే దీని కోసం మీరు వెంటనే వాట్సాప్ సెట్టింగ్ లకు వెళ్లి కాల్స్ ఫీచర్ లోని ప్రొటెక్ట్ ఐపి అడ్రస్ ను ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ని ఆన్ చేయడానికి మీరు కొన్ని సాధారణ ట్రిక్స్ అనుసరించాలని చెబుతున్నారు. కాగా వాట్సాప్ లో ఈ సేఫ్టీ ఫీచర్ ని ఆన్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా మీరు కాల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ సెట్టింగ్ లలో ఎక్కడ కనిపిస్తుంది? ఈ ఫీచర్‌ను కనుగొనడానికి మీరు మీ ఫోన్‌లో వాట్సాప్‌ని తెరవాలి.
ఆ తర్వాత రైట్ సైడ్ వైపు కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. తర్వాత, సెట్టింగ్ లపై క్లిక్ చేసి ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ప్రైవసీ ఆప్షన్ లో మీరు అధునాతన ఆప్షన్ లలో ఈ ఫీచర్ ను చూస్తారు. అందులో అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ప్రొటెక్షన్ ఐపీ అడ్రస్ ఇంకా కాల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసుకోవాలి. ఈ ఫీచర్ ని ఆన్ చేసిన తర్వాత, మీ అన్ని కాల్ లు వాట్సాప్ సర్వర్ ద్వారా వెళ్తాయి కాబట్టి మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు. ఎవరు కూడా హ్యాక్ చేయలేరు.