Let's find out the science behind the rituals we have been following since ancient times.
పూర్వకాలం నుంచి మనం పాటిస్తున్న ఆచారాల వెనుక దాగి ఉన్న సైన్స్ ఏమిటో తెలుసుకుందాం.
భారతదేశం అంటేనే అనేక మతాలకు, విశ్వాసాలకు నిలయం. ఇతర ఏ దేశంలోనూ లేని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయి. అనేక వేల సంవత్సరాల నుండి ఇక్కడి ప్రజలు వాటిని పాటిస్తున్నారు.
అయితే నేటితరం వారు అలాంటి ఆచారాలను మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తున్నారు, కానీ కొంత మంది ఇప్పటికీ వాటిని పాటిస్తూనే ఉన్నారు. ఈ మూఢ నమ్మకాలుగా ముద్ర పడ్డ పలు ఆచారాలను, వాటిలో అంతర్గతంగా దాగి ఉన్న పలు అర్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలంలో కేవలం మగవారే బయటికి వెళ్లి శారీరక శ్రమ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మహిళలు ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండి తక్కువగా శ్రమిస్తారు కాబట్టి వారికి గాజులను ధరింపజేసే వారు. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుందట. అంతే కాకుండా ఆడ వారి శరీరం నుంచి విడుదలయ్యే నెగెటివ్ శక్తిని నిర్వీర్యం కోసం కూడా గాజులను ధరింపజేసే వారట.
చిన్నారులకు చెవులు కుట్టడం సహజమే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాటకొస్తే కొంత మంది మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట. హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ చెడితే ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. అయితే సాధారణంగా చెట్లన్నీ పగటి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తే ఈ చెట్టు రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు. హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. దీనితో వారి రుతు క్రమం సరిగ్గా ఉంటుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఆలయాల్లో ఉంటే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు మెదడు కుడి, ఎడమ భాగాలు కొంత సేపు ఏకమవుతాయట. దీనితో మన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందట. ఏకాగ్రత పెరుగుతుందట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట. భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట. ఒక వేళ మనం ఉత్తరం దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధ సమస్యలు వస్తాయట. తలనొప్పి, అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి తలలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించకూడదట.
నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీనితో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట. సామర్థ్యం కూడా పెరుగుతుందట. ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయట. దీనితోపాటు మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుందట. చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల అక్కడ చివర్లో ఉండే నరాలు రిలాక్స్ అవుతాయట. దీనితో శరీరానికి హాయి లభించి చల్లదనం ఇస్తుందట. అంతేకాదు గోరింటాకు పెట్టుకోవడం వల్ల తలనొప్పి, జ్వరం, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నేలపై భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట.