Salary Increase: These employees will increase the Great News, the salary of 62 thousand, from Pune to Clark
జీతం పెంపు: ఈ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, ఏకంగా 62 వేలు పెరగనున్న జీతం, ప్యూన్ నుంచి క్లార్క్ వరకు ఎవరికెంత పెరుగుతుంది.
జీతం పెంపు: ఈ ఉద్యోగులు పూణే నుండి క్లార్క్ వరకు 62 వేల జీతం గ్రేట్ న్యూస్‌ను పెంచుతారు.
8వ వేతన సంఘం జీతాల పెంపు: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించిన తరువాత ఉద్యోగుల జీతభత్యాల పెంపుపై చర్చ. మొత్తం కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
కొత్త వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఉద్యోగుల జీతాలు ఏకంగా 62 వేలు పెరుగుతాయి.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లో ఉంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న కనీస వేతనంతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గుణిస్తే వచ్చేదే కొత్త జీతం. 7వ వేతన సంఘం అమల్లో వచ్చినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంది. దాంతో కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా. అదే జరిగితే కనీస వేతనం ప్రస్తుతం 18 రూపాయలు ఉంది. ఇది కాస్తా 51,480 రూపాయలకు పెరగనుంది. పెన్షన్ కూడా 9 వేల నుంచి 25,740 రూపాయలు అవుతుంది.
ప్యూన్ నుంచి క్లార్క్ వరకు జీతాలు ఎంత పెరుగుతాయి
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా వేసింది. ముఖ్యంగా ప్యూన్, అటెండెంట్ వంటి లెవెల్ 1 ఉద్యోగులకు కనీస వేతనం 18 వేల నుంచి 51,480 రూపాయలకు పెరుగుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్‌లకు 19,900 నుంచి 56,914 రూపాయలు. ఇక కానిస్టేబుల్, స్కిల్ ఉద్యోగులు ప్రస్తుతం కనీస వేతనం 21,700 ఉంది. ఇది కాస్తా 62,062 రూపాయలు. ఇక స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లార్క్ ఉద్యోగులకు కనీస వేతనం 25,500 రూపాయల నుంచి 72,930 రూపాయలకు పెరగనుంది. అదే విధంగా సీనియర్ క్లార్క్, టెక్నికల్ ఉద్యోగులకు కనీస వేతనం 29,200 రూపాయల నుంచి 83,512 రూపాయలు.
8వ వేతన సంఘంతో పెన్షనర్లకు కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస పెన్షన్ 9 వేల నుంచి 25, 740 రూపాయలు. 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.