higher salary Jobs

Certification courses that lead to job opportunities with higher salary

డిగ్రీలు లేకున్నా పర్వాలేదు... ఈ షార్ట్ టర్మ్ కోర్సులు చేసారంటే లక్షలు సంపాదించే ఉద్యోగాలు.

Certification courses that lead to job opportunities with higher salary

మీకు డిగ్రీ లేదా? సమస్య లేదు! కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు మంచి జీతం వచ్చే ఉద్యోగాలను అందిస్తాయి... ఆ కోర్సుల గురించి తెలుసుకుందాం.

అధిక జీతంతో ఉద్యోగావకాశాలు కల్పించే సర్టిఫికేషన్ కోర్సులు

అధిక జీతం వచ్చే ఉద్యోగం కోసం చూస్తున్నారా... కానీ మీకు డిగ్రీ లేదా? ఏం చింతించకండి! 3-6 నెలల సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల ద్వారా మీరు డిగ్రీ లేకుండా మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లు మీ సమయం మరియు డబ్బును ఆదా చేస్తాయి.

1. డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు

డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ కోర్సులు డేటా సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్, ప్రాజెక్ట్ మేనేజర్, స్టాటిస్టీషియన్ వంటి పాత్రలకు తలుపులు తెరుస్తాయి. ఆరంభంలో సంవత్సరానికి ₹7 లక్షల జీతం పొందవచ్చు. మంచి అనుభవం వచ్చాక ఇది ₹14 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.

2. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ :

పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. కంపెనీలు తమ వ్యవస్థలను రక్షించుకోవడానికి అనుభవజ్ఞులైన వ్యక్తులను కోరుకుంటాయి. సైబర్ సెక్యూరిటీ ఉద్యోగులకు జీతాలు సంవత్సరానికి ₹2 లక్షల నుండి ₹22.5 లక్షల వరకు ఉంటాయి, అనుభవం, నైపుణ్యాలపై వారి సాలరీ ఆధారపడి ఉంటుంది.

3. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సర్టిఫికేషన్ :

కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సర్టిఫికేషన్లు అనేక ఉద్యోగ అవకాశాలకు దారితీస్తాయి. అనేక పెద్ద కంపెనీలు ఈ కోర్సులు చేసినవారికి మంచి సాలరీతో నియమించుకుంటున్నారు. ఇక 1-4 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రారంభ జీతాలు ₹3 లక్షల వరకు వుంటుంది.

4. CISM సర్టిఫికేషన్

ISACA (Information Systems Audit and Control Association) నుండి CISM (Certified Information Security Manager) సర్టిఫికేషన్ చాలా ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. CISM హోల్డర్లు సంవత్సరానికి సగటున ₹8.87 లక్షలు సంపాదిస్తారు.

ఈ సర్టిఫికేషన్ కోర్సులు అందించే సంస్థలు మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు అభ్యర్థులను సంసిద్దం చేస్తాయి. మంచి జీతం వచ్చే కెరీర్‌ దిశగా నడిపిస్తాయి. అయితే పూర్తి వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా కోర్సును ఎంచుకొండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.