Central Govt free electricity for common man.. Apply like this immediately
Free Current: సామాన్యులకి కేంద్ర ప్రభుత్వం ఉచిత కరెంట్.. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి.
Free Current: మరి కొన్ని రోజుల్లో వేసవికాలం రాబోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంట్ బిల్లులు మోత మోగిపోతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్నిచోట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న కూడా అది లిమిట్ దాటితే మాత్రం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న ఈ పథకంలో మీకు అలాంటి సమస్య ఉండదు. పూర్తి ఫ్రీగా కరెంటు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఏ పని చేయాలన్నా కూడా కరెంటు తప్పకుండా ఉండాలి. ఇక రాబోతున్న వేసవికాలం మండే ఎండలో కనీసం ఫ్యాన్ గాలి అయినా లేకుంటే గంట కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక చల్లటి వార్త చెప్పింది.
మీరు ఎంత కరెంటు ఉపయోగించినా కూడా ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ప్రభుత్వము మీకే తిరిగి చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఇళ్లలో సౌరఫలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖామంత్రి ప్రహ్లాద జోషి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ పైకప్పు సౌర్య కార్యక్రమంలో ఈ పథకం గుర్తింపు తెచ్చుకుంది. అయితే దీని ప్రధాన లక్ష్యం 2027 నాటికి కోటిలకు పైగా సౌర శక్తిని అందించడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ పథకం స్థిరత్వం మరియు స్వాలంబనకు కొత్త నాంది అని జోషి చెప్పుకొచ్చారు. అయితే మార్చి 10 వరకు 10.09 లక్షల ఇన్స్టాలేషన్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.
ఇప్పటివరకు ఈ పథకానికి 47.3 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే 6.13 లక్షల మందికి రూ. 4770 కోట్ల సబ్సిడీని అందించారు. అక్టోబర్ నెల వరకు 20 లక్షల ఇళ్లను సోలరైజ్ చేయడమే దీని ప్రధాన లక్ష్యమంటూ తెలిపారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 2024లో ప్రారంభించారు.