Consanguineous Marriages

Can we have Consanguineous Marriages?

Genetic Diseases : మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధులు వస్తాయా? కొత్త అధ్యయనంలో తేలింది ఇదిగో..!

Can we have Consanguineous Marriages?

Consanguineous Marriages : దగ్గరి బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, మేనరికపు పెళ్లిళ్లతో పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు వస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది.

Genetic Diseases : పెళ్లి అనగానే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి మరి చేయాలి అంటారు. ఈ మాట పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నమాట.. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లకు పాత తరాలతో సంబంధం లేదు. అమ్మాయి, అబ్బాయికి నచ్చితే చాలు.. పెళ్లి చేసేసుంటున్నారు. అందులో చాలామంది తమ సామాజిక వర్గానికి చెందినవారని, తెలిసిన వాళ్లు, దగ్గరి బంధువులతో పెళ్లిళ్లు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

తెలిసినవాళ్లు మనవాళ్లు అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. మరికొంతమంద వారసత్వంగా కూడా విహహాలను జరిపిస్తుంటారు. చుట్టాల వాళ్ల వారితో పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇక్కడ అంతా బాగానే ఉంది.. అసలు విషయం ఏమిటంటే.. మేనరికపు పెళ్లిళ్ల విషయంలో ఇప్పటికి చాలామందికి అవగాహన ఉండదు.

ఒకవేళ తెలిసినా ఏమి అవుతుందిలే అన్నట్టుగా పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇక్కడ పెళ్లి మాత్రం చేయగలరు.. కానీ, ఈ మేనరికపు పెళ్లి చేసుకున్న ఆ జంటలకు పుట్టబోయే పిల్లలు అనేక జన్యుపరమైన వ్యాధులతో పుడుతుంటారు. ఆ తర్వాత పిల్లలను చూసి బాధపడిపోతుంటారు.

సాధారణంగా మేనరికపు పెళ్లిళ్ల వల్ల పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు వస్తాయని అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇది మరోసారి రుజువైంది. దగ్గరి బంధువులతో పెళ్లిళ్లు చేసుకునే వారికి పుట్టబోయే పిల్లలకు జన్యుసంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనంలో తేలింది.

కొంతమందిలో కొన్ని వ్యాధులు వారసత్వంగా పిల్లలకు వస్తున్నాయని ఈ అధ్యయనంలో గుర్తించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 60శాతం పెళ్లిళ్లు వారి దగ్గరి బంధువులతోనే జరుగుతున్నాయి. ఆయా జంటలకు పుట్టిన పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమించినట్టుగా తేలింది.

ఈ కొత్త అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌‌లో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఏపీలోని పలు సామాజిక వర్గాలకు చెందిన 281 మంది రక్త నమూనాలు సేకరించి జన్యుక్రమాలను పరిశీలించారు. అందులో ఎక్కువ మందికి ఈ జన్యుపరమైన వ్యాధులు ఉన్నాయని తేల్చారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.