who should not drink coconut water?

Do you know who should not drink coconut water?

కొబ్బరి నీళ్లు పొరపాటున కూడా ఎవరు తాగకూడదో తెలుసా? ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Do you know who should not drink coconut water?

కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొబ్బరి నీళ్లకి కొందరు దూరంగా ఉండాలి.

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొబ్బరి నీళ్లకి కొందరు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు ఎవరికి హానికరమో తెలుసుకుందాం.

కిడ్నీ సమస్యలు:

​కొబ్బరి నీళ్లలో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం, కానీ మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది హానికరం. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. ఇది హైపర్‌కలేమియా (రక్తంలో అధిక స్థాయి పొటాషియం) కు దారితీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, క్రమరహిత హృదయ స్పందన, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు

లోబీపీ సమస్య:

​కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉన్నవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. ఇది తలతిరగడం, అలసట, మూర్ఛ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే లోబీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగకండి.

డయాబెటిస్:

కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. ఇది కొబ్బరి నీళ్ల రుచికి తీపిని అందిస్తుంది. అయితే, ఈ చక్కెర డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. వారికి సమస్యలను కలిగిస్తుంది. మధుమేహ రోగులు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోవచ్చు. అందుకే డయాబెటిక్ రోగులు కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

శస్త్రచికిత్సకు ముందు:

ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లయితే, కొన్ని రోజుల ముందు కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు శరీర రక్తపోటు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఇది శస్త్రచికిత్స సమయంలో లేదా తరువాత సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, శస్త్రచికిత్సకు ముందు కొబ్బరి నీళ్లు తాగకుండా ఉండటం మంచిది.

జీర్ణ సమస్యలు:

ఈ రోజుల్లో చాలా మంది కడుపులో గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి జీర్ణసమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇప్పటికే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS) లేదా అల్సరేటివ్ కొలైటిస్ వంటి కడుపు సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. అదనంగా, కొబ్బరి నీళ్లలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

అలెర్జీ సమస్యలు

కొంతమందికి కొబ్బరి లేదా కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగడం హానికరం. కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ, చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ ఉంటే, దూరంగా ఉండటమే మేలు.

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.