Postal life insurance
డిగ్రీ పట్టా ఉంటే తపాలా జీవిత బీమా.
తపాలా జీవిత బీమా పథకం ప్రతి పౌరుడికి ధీమాగా ఉంటుందని, డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక పౌరుడు తపాలా జీవిత భీమా పథకంలో భాగ్యస్వాములు కావచ్చని నిర్మల్ సబ్ డివిజన్ అధికారి సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన తపాలా జీవిత బీమా పథకానికి సంబంధించిన విషయాలను విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలలోపు గల ప్రభుత్వ ఉద్యోగులు, డిగ్రీ పట్టా పొందిన పట్టబద్రులు కూడా ఈ పథకంలో చేరవచ్చు అని ఆయన వెల్లడించారు. తపాలా శాఖలో ప్రవేశపెట్టిన తపాలా జీవిత బీమా 141 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన తపాలా జీవిత బీమా దినోత్సవం జరుపనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పట్టబద్రులు తపాల జీవిత బీమా పథకములో చేరాలని ఆయన కోరారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందవచ్చని తెలిపారు. పట్టభద్రులు 20 వేల నుంచి 50 లక్షల పాలసీ పొందవచ్చు అని, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల వారు ఎటువంటి విద్యార్హత లేకుండా గ్రామీణ తపాల జీవిత బీమా పథకములో 10 లక్షల పాలసీ వరకు పొందవచ్చని వెల్లడించారు. పట్టబద్రులు , గ్రామీణులు అందుబాటులో ఉన్న తపాలా కార్యాలయంలో తపాల పథకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.