Bank Holidays In March 2025

Bank Holidays In March 2025

Bank Holidays In March 2025 : March నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

Bank Holidays In March 2025

Bank Holidays in March 2025: మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ అవసరాల కోసం బ్యాంకులకు వెళ్తున్నవారు బ్యాంకు రూల్స్, సెలవులపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యం.

లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పనుల్లో జాప్యం కూడా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. ఫిబ్రవరి నెల ముగిసి మార్చి నెల ప్రారంభంకాబోతున్నది. ప్రతి నెల మదిరిగానే ఈ నెలలో కూడా బ్యాంకులకు సెలవులుండనున్నాయి. మార్చి నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నెలకు సంబంధించిన బ్యాంకు హాలిడేస్ లిస్టును ఆర్బీఐ రిలీజ్ చేసింది.

మార్చి నెలలో హోలీ పండగ, బీహార్ దినోత్సవం, షబ్-ఎ-ఖాదర్, జమాత్ ఉల్ విదా వంటి ఫెస్టివల్స్ నపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ ప్రకటించిన సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతుంటాయని గమనించాలి. పండగలతో పాటు, రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే:

మార్చి 2: ఆదివారం బ్యాంకులకు సెలవు.

మార్చి 7: శుక్రవారం చాప్చర్ కుట్ పండుగ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.

మార్చి 8: శనివారం రెండవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.

మార్చి 13: గురువారం హోలిక దహన్ సందర్భంగా డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువంగపురంలలో బ్యాంకులకు సెలవు.

మార్చి 14: శుక్రవారం డోల్‌ జాత్రా పండగ కారణంగా వెస్ట్‌ బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

మార్చి 15: శనివారం యావోసెంగ్ దినోత్సవం సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో ఈ రోజు బ్యాంకులు మూసివేస్తారు.

మార్చి 16: ఆదివారం బ్యాంకులకు సెలవు.

మార్చి 22: శనివారం నాల్గవ శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.

మార్చి 23: ఆదివారం ఈ రోజు దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.

మార్చి 27: గురువారం షబ్-ఎ-ఖదర్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.

మార్చి 28: శుక్రవారం జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.

మార్చి 30: ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.

దేశంలో రాష్ట్రాలవారీగా మారే జాతీయ సెలవులు, ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో పాటు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులను మూసివేస్తారు. బ్యాంకులు మూతపడినప్పటికీ కస్టమర్లు డిజిటల్‌గా వివిధ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు బ్యాంకు సెలవుల సమయంలో అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు తమ పనిని ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి.

రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి.

ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.