Precautions to be taken while renting out a house

Precautions to be taken while renting out a house

ఇంటిని రెంటుకు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే ఇబ్బందులు తప్పవా..

Precautions to be taken while renting out a house

ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా వెళ్లి జాబ్ చేయాలంటే ముందుగా మనం అక్కడ ఉండడానికి ఒక ఇల్లు ను అద్దెకు తీసుకుంటాం. తర్వాత మనం అక్కడికి వెళ్లి స్థిరపడతాం.

ప్రస్తుతం చిన్న పట్టణాల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకూ చాలా మంది ఇంటిని అద్దెకి ఇస్తూ ఉంటారు. వారు ఒక ఇల్లుపై మళ్లీ అదనపు నిర్మాణాలు చేసి అద్దె రూపంలో ఆదాయం పొందుతారు. అయితే ఇందులో అద్దెకు ఉండడం సులభమే కానీ యజమాని అద్దెకు ఇవ్వడం అనేది సులభమైన పని కాదు. ఇందులో అనేక న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అద్దెకు ఇచ్చేటప్పుడు యజమాని తన సొంత హక్కులను కాపాడుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరే చూడండి.

1. అదే ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తికి సకాలంలో రెంట్ చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అతని వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడమే కాకుండా జిరాక్స్ కాపీలను దగ్గర ఉంచుకోవడం మంచిది.

2. లీజుకు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని నెలలకు సరిపడా స్టాంప్ చేయబడాలి. ఒకవేళ దీని వ్యవధి 11 నెలల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ పత్రంపై తప్పనిసరిగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయబడాలి.

3. మనం అద్దెకు ఇచ్చినటువంటి ఆస్తిని కనీసం మూడు నెలలకు ఒక సారైనా యజమాని లేక అతని తరపున ఎవరైనా సందర్శించడం మంచిది.

4. అద్దె ఉన్నవారు విద్యుత్ మరియు నీటి చార్జీలను క్రమంగా చెల్లిస్తున్నారా లేదా అనేది మీ ఏరియా సొసైటీ నుంచి వివరాలు తెలుసుకోవాలి. ఇక్కడ అద్దెదారు మధ్య ఒప్పందం ప్రకారమే నివాస వాణిజ్య అవగాహన నిబంధనను బట్టి ఇవి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అద్దెదారులు ఇవి చెల్లించకపోతే యజమాని అద్దె ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు ఉంటుంది.

5. అద్దెదారుడు రాసుకున్న ఒప్పందం ప్రకారం మన ఆస్తి ఖాళీ చేయకపోతే నష్టపరిహారం విధించబడుతుంది రాతపూర్వకంగా నిబంధనలను ముందుగానే రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల అద్దెకు ఉన్న వారు ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడకుండా నిరోధిస్తుంది. తప్పనిసరిగా డిపాజిట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే అద్దెదారులు ఏదైనా ఆస్తి నష్టం చేసినట్లయితే వారు వెళ్లేటప్పుడు ఆ డిపాజిట్ నుంచి కొంత తీసుకోవచ్చని రాసి పెట్టుకోవడం చాలా మంచిది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.