8 symptoms that indicate poor blood circulation in the body.
శరీరంలో బ్లడ్ సర్కులేషన్ సరిగా అవ్వడంలేదని తెలిపే 8 లక్షణాలు..?
ఒక మొక్కకు నీరు ఎంత ముఖ్యమో శరీరానికి రక్త ప్రసరణ కూడా అంతే ముఖ్యం. రక్తం ద్వారానే మన శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి.
అంటే, ఈ ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడితే ముఖ్యంగా పూర్ బ్లడ్ సర్క్యులేషన్ కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి.. కాబట్టి బ్లడ్ సర్కులేషన్ సరిగా అవ్వడంలేదని తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి..
మన శరీరంలో రక్తం నిరంతరం ప్రవహిస్తుంది, దీనిని రక్త ప్రసరణ అంటారు. ఈ ప్రవాహం మన హృదయ స్పందన వల్ల సంభవిస్తుంది. ఇది మన శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాలను రవాణా చేస్తుంది. ఈ పోషకాలు కణాలకు శక్తిని అందిస్తాయి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.
విటమిన్ బి1లోపిస్తే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
కొన్ని కారణాల వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మందగించినప్పుడు లేదా అంతరాయం ఏర్పడినప్పుడు, అది అనేక సమస్యలను కలిగిస్తుంది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు తగినంత ఆక్సిజన్ ,పోషకాలు అందవు. దీని కారణంగా, శరీర భాగాలు సరిగా పనిచేయలేవు. దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
రక్త ప్రసరణ తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరంలోని వివిధ భాగాలలో కనిపిస్తాయి.
చలి చేతులు,కాళ్ళు: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ సమస్య చేతులు, కాళ్ళలో చల్లగా అనిపించడం. వేసవి లేదా శీతాకాలం కావచ్చు, మీ చేతులు, కాళ్ళు చల్లగా ఉంటే, అది రక్త ప్రసరణ సరిగా జరగడంలేదనడానికి సంకేతం.
వాపు: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలలో వాపు రావచ్చు. ఈ వాపు పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో సంభవించవచ్చు.
అలసట, బలహీనత: రక్తంలో ఆక్సిజన్ లేనప్పుడు ఎల్లప్పుడూ అలసటగా బలహీనంగా అనిపిస్తుంది.
తిమ్మిరి లేదా జలదరింపు: రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల, చేతులు ,కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు సమస్య ఉండవచ్చు.
గాయాలు: మీ శరీరంపై ఏదైనా చిన్న గాయం అయితే, అది చాలా నెమ్మదిగా నయం అవుతుంటే, అది రక్త ప్రసరణ సరిగా లేనట్లు గ్రహించాలి.
చర్మం రంగులో మార్పు: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల చర్మం రంగు కూడా మారవచ్చు. చర్మం పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది.
జుట్టు రాలడం: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు.
కండరాల తిమ్మిరి: రక్త ప్రసరణ తగ్గడం వల్ల కండరాలు తిమ్మిరిగా అనిపిస్తాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..