PMAY 2025

AP Government financial assistance for construction of own house

PMAY : సొంతింటి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం- సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ, అవసరమైన పత్రాలివే.

AP Government financial assistance for construction of own house

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. పీఎంఏవై 2.0 పథకం ద్వారా ఆర్థిక పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఆన్ లైన్ చేయనున్నారు. పీఎంఏవై 2.0 పథకంలో భాగంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ఆర్థిక సాయం పొందేందుకు అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాల వివరాలను అధికారులు ప్రకటించారు. దరఖాస్తుదారులు ఈ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలని సూచించారు.

పీఎంఏవై(PMAY 2.0) - అర్హత ప్రమాణాలు

1. గతంలో ఎప్పుడూ ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండరాదు.

2. పక్కా ఇల్లు కలిగి, ఇంటి పన్ను మీ పేరుపై ఉండరాదు.

3. ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు.

4. నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.

5. ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను కట్టరాదు.

6. 340 చదరపు అడుగుల లోపు భూమి ఉన్న వారే అర్హులు .

7. దరఖాస్తు చేసుకునే వారు ఉన్న రైస్ కార్డు / రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎవరికీ గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఉండరాదు.

PMAY 2.0 దరఖాస్తుకు ఏ పత్రాలు అవసరం

1. ఆధార్ కార్డుల జిరాక్స్ [భార్య + భర్త ] సంతకాలతో

2. రేషన్ కార్డు / బియ్యం కార్డు జిరాక్స్

3. బ్యాంకు అకౌంట్ జిరాక్స్ [భార్య + భర్త ]

4. జాబ్ కార్డు జిరాక్స్(ఉపాధి హామీ)

5. దరఖాస్తుదారుని పాస్ పోర్ట్ సైజు ఫొటోలు- 2

6. పట్టా లేదా పొజిషన్ సర్టిఫికెట్ జిరాక్స్

7. క్యాస్ట్ సర్టిఫికెట్

8. ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్

9.పనిచేస్తున్న మొబైల్ నెంబర్

పీఎంఏవై ఇంటి లోన్ మరిన్ని వివరాలకు గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో వార్డ్ ఎమినిటీ సెక్రటరీ / ప్లానింగ్ సెక్రెటరీని సంప్రదించవచ్చు. కొత్తగా ఇంటి లోన్ కోసం అప్లై చేసుకునే వారు పైన తెలిపిన డాక్యుమెంట్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై 2.0)లో భాగంగా సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం పలు దశల్లో నిలిచిపోయిన ఇళ్ల పనులు పూర్తి చేయించనున్నారు. లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష అందిస్తుంది. అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.