Naga saints
కుంభమేళా తర్వాత నాగ సాధువులు ఎక్కడికి వెళతారు? వారి రహస్య జీవితం ఎలా సాగుతుంది?
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భారీగా నాగసాదువులు కనిపిస్తున్నారు. వీరు సాధారణ సమయాల్లో జనావాసాల్లో కనిపించరు...మరి ఎక్కడుంటారు? కుంభమేళా తర్వాత ఎక్కడికి వెళతారు?
వీరి రహస్య జీవితం గురించి తెలుసుకోండి.
కుంభమేళాలో మొదటి షాహీ స్నానంలో నాగా సాధువులు పాల్గొంటారు. ఇది వారికి ముఖ్యమైన ధార్మిక కార్యక్రమం. ఈ స్నానంలో మొదటగా నాగా సాధువులే గంగానదిలో మునుగుతారు. వారి శరీరంపై భస్మం, రుద్రాక్షమాల వారిని ఇతర సాధువుల నుండి వేరు చేస్తాయి.
కుంభమేళా తర్వాత నాగా సాధువులు దిగంబరులుగా ఆశ్రమానికి తిరిగి వెళతారు. సమాజంలో దిగంబర రూపం ఆమోదయోగ్యం కాదు కాబట్టి వారు గుడ్డ కప్పుకుని ఆశ్రమంలో ఉంటారు. దిగంబరులకు భూమే పరుపు, ఆకాశం దుప్పటిగా భావిస్తారు.
కుంభమేళా తర్వాత నాగసాధువులు ఎక్కడికి వెళతారు?
ప్రయాగరాజ్ తో పాటు మరికొన్ని కుంభమేళాల సమయంలోనే నాగ సాధువులు జనాల్లోకి వస్తారు. ఆ తర్వాత వీళ్లు మనుషులకు కనిపించకుండా ఏకాంత జీవితం గడుపుతారు. ఇలా ప్రస్తుతం ప్రయాగరాజ్ కుంభమేళాకోసం బయటకు వచ్చిన నాగసాధువులు ఇది ముగియగానే హిమాలయాలు, ఇతర ఏకాంత ప్రదేశాలకు వెళతారు. అక్కడ కఠిన తపస్సు చేస్తూ అడవుల్లో దొరికే కాయగూరలు, పళ్ళు తింటూ జీవిస్తారు. ఇలా కఠిన తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాలన్నదే నాగ సాధువుల లక్ష్యం.
ఇక మరికొంతమంది నాగా సాధువులు కుంభమేళా తర్వాత ప్రముఖ తీర్థక్షేత్రాలలో నివసిస్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని వంటి ప్రదేశాలలో వారు ధార్మిక సాధన చేస్తూ ఉంటారు.
మరికొందరు నాగా సాధువులు ధార్మిక యాత్రలు కూడా చేస్తూ వుంటారు. వివిధ తీర్థక్షేత్రాలు సందర్శిస్తూ, తమ జ్ఞానం, సాధన ద్వారా సమాజానికి ధార్మిక బోధనలు చేస్తారు. ఈ యాత్రల్లో వారు సత్యం, ముక్తి కోసం అన్వేషిస్తారు.