Increase in land registration fees.
Breaking: ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెంపు.
ఏపీ ప్రభుత్వం(Ap Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల(Land Registrations) ధరలు పెంచేందుకు కసరత్తులు చేస్తోంది.
ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే అమరావతి ప్రాంతంలో భూముల విలువలు ఇప్పటికే ఎక్కువగా ఉండటంతో అక్కడ కొంత మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భూముల విలువ, బుక్ విలువ మధ్య తేడాలుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదే విషయాన్ని త్వరలో సీఎం చంద్రబాబునాయుడు(Cm Chandrababu) కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. రిజిస్ట్రేషన్ల విలువలు 15 నుంచి 20 శాతం వరకూ పెంచాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలనే అంశాలపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త ప్రచారం కావడంతో ప్రజలు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు భారీగా తరలి వెళ్తున్నట్లు సమాచారం.