Cylinder leak

Cylinder leak

LPG: సిలిండర్‌ లీక్‌ అయితే వెంటనే ఇలా చేయండి.. ఎలాంటి ప్రమాదం జరగదు.

Cylinder leak

దేశంలో కోట్లాది మంది తమ ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ రాకతో ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కొంత మంది అజాగ్రత్త కారణంగా గ్యాస్‌ సిలిండర్లు లీకయిన సంఘటనల గురించి అడపాదడపా వినే ఉంటాం. కొన్ని సందర్భాల్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూశాం.

కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకపోయినా, మన తప్పు లేకపోయినా గ్యాస్‌ లీకవుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం వల్ల గ్యాస్‌ లీకయిన సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. 

ఇంతకీ గ్యాస్‌ లీకయిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకవుతున్నట్లు అనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిలిండర్‌కు ఉండే రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి. దీంతో గ్యాస్‌ లీక్‌ ఆగిపోతుంది.

ఇక గ్యాస్‌ లీకవుతున్న సమయంలో గదిలో ఎలాంటి లైట్స్‌ ఆన్‌ చేయకూడదు. ఏమాత్రం గ్యాస్‌ వాసన వచ్చినా అస్సలు ఎలక్ట్రిక్‌ స్విచ్ఛుల జోలికి వెళ్లకపోవడమే బెటర్‌.

గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వచ్చినా సరే వెంటనే కిటికీలను, తలుపులను తెరవాలి. గదిలో గాలి బాగా వీచేలా చేయాలి. అనంతరం గ్యాస్‌ను ఆఫ్‌ చేయాలి. దీనివల్ల గ్యాస్‌ అంతా బయటకు వెళ్లిపోతుంది.

గ్యాస్‌ లీకవుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్టవ్‌ను వెలిగించకూడదు. గ్యాస్ స్టవ్‌ను వెలిగించడానికి ప్రయత్నిస్తే, మంటలు సిలిండర్‌కు చేరుకుని, సిలిండర్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

ఒక ఒకవేళ గ్యాస్‌ సిలిండర్‌ చుట్టూ మంటలు వ్యాపిస్తే వెంటనే సిలిండర్‌పై తడి సంచి లేదా దుప్పటి వేయాలి. ఇలా చేయడం వంట మంట ఆరిపోతుంది. అనంతరం గ్యాస్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.