Follow these tips to make your home look classy and rich

Follow these tips to make your home look classy and rich

Home Decor Tips: మీ ఇల్లు క్లాసీగా, రిచ్ లుక్‍తో కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి!

Follow these tips to make your home look classy and rich

Home Decor Tips: కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇల్లు క్లాసీగా కనిపిస్తుంది. పెట్టిన ఖర్చు కంటే ఖరీదైన లుక్ ఇస్తుంది. ఆ టిప్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఇల్లు క్లాసీ, రిచ్ లుక్‍తో ఖరీదైన దానిలా కనిపించాలని అందరూ అనుకుంటారు. అయితే, ఇంటిని సరిగా సర్దుకోకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే చీప్‍గా కనిపిస్తుంది. అందుకే నిత్యం ఇంటి విషయంలో కొన్ని టిప్స్ పాటించాలి. వీటి వల్ల ఇల్లు క్లాసీగా.. మరింత ఖరీదుగా లుక్ ఇస్తుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఇల్లు క్లాసీగా, రిచ్‍గా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి.

మొక్కలు ఇలా..

ఇంటి మెయిన్ డోర్ వద్ద మొక్కలు ఉంటే మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. గుమ్మాన్ని స్టైలిష్‍గా తీగ మొక్కలతో డెకరేట్ చేయవచ్చు. ఇంటి గుమ్మం వద్ద స్టాండ్‍లపై మంచి లుక్ ఉండే మొక్కలను పెట్టవచ్చు. వీలైతే అందమైన మొక్కలతో గుమ్మానికి సమీపంలో లాన్‍లా పెట్టవచ్చు. ఇంట్లో ఇండోర్ మొక్కలు పెంచాలి. మొక్కలు ఉండడం వల్ల ఇళ్లు క్లాసీగా కనిపిస్తుంది. ఉన్నదాని కంటే ఖరీదైన దానిలా అనిపిస్తుంది.

చెక్క ఫర్నీచర్

చెక్కతో చేసిన ఫర్నీచర్ ఖరీదైన దానిలా కనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఎక్కువ శాతం అలాంటి ఫర్నీచర్ ఉంచుకోవాలి. ప్లాస్టిక్, స్టీల్‍తో చేసిన ఫర్నీచర్ అంత కాస్ట్లీ లుక్ ఇవ్వవు. చీప్‍గా కనపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇంట్లో ఫర్నీచర్ సాధ్యమైనంత చెక్కతో తయారు చేసినవి ఉంటే మెరుగ్గా ఉంటుంది. ఇవి క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని మీకు నచ్చినట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటికి వచ్చే వారిని అట్రాక్ట్ చేస్తాయి.

సరిగా సర్దుకోవడం చాలా ముఖ్యం

ఇంట్లో ఇంతటి ఖరీదైన వస్తువులు ఉన్నా సరిగా సర్దుకోకపోతే లుక్ బాగోలేదు. ఏది ఎక్కడ ఉంచాలో ఎప్పుడూ ఆక్కడే పెట్టాలి. గందోరళగోళంగా ఉంటే వాటి విలువ కూడా తక్కువ అన్నట్టు కనిపిస్తాయి. ఇంట్లో చెల్లాచెదురుగా ఏవీ ఉండకుండా చూసుకోవాలి. కిచెన్ సామాన్లు, నిత్యం వాడే వస్తువుల నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మల వరకు అన్ని ఒక్కడ ఉంచాలో అక్కడే పెట్టాలి. దీనివల్ల ఇల్లు క్లీన్‍గా, క్లాసీగా కనిపిస్తుంది.

అద్దాలు, షాండిలేయర్స్

ఇంటి కిటికీలకు మిర్రర్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఇంటికి క్లాసీ, రిచ్ లుక్ వస్తుంది. ఇంట్లో గోడలకు ఇక్కడక్కడా డిజైన్‍తో కూడిన అద్దాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే, ఇంటి పైకప్పుకు గాజు షాండిలేయర్ పెడితే లుక్ రిచ్‍గా ఉంటుంది.

పెయింటింగ్స్

ఇంట్లో పెయింటింగ్స్ పెట్టుకోవాలి. మీకు నచ్చిన, మంచి డిజైన్‍తో ఉన్న పెయింటింగ్స్ వల్ల ఇంటికి స్పెషల్ లుక్ వస్తుంది. మీ అభిరుచిని కూడా ఇంటికి వచ్చిన వారికి చూపించినట్టు అవుతుంది. క్లాసీ పెయింటింగ్స్ వల్ల ఇంటి రిచ్‍లుక్ పెరుగుతుంది.

సరైన లైటింగ్

ఇంట్లో వెలుతురు ఎప్పుడూ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మబ్బుగా ఉండే అసలు చీప్‍గా కనిపిస్తుంది. అందుకే లైటింగ్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. మంచి లైటింగ్‍ ఇచ్చే వాటిని ఇంట్లో సెట్ చేయాలి.

ఇంట్లో ఉండే కిచెన్, బూత్రూమ్‍లో ఉండే హార్డ్ వేర్ వస్తువులను ట్రెండ్‍కు తగ్గట్టు లేటెస్ట్ డిజైన్, ఫీచర్లతో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కూడా ఇంటి రిచ్‍నెస్ పెరుగుతుంది. లుక్ కూడా క్లాసీగా ఉంటుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.