Farmers do this before the 19th installment of PM Kisan.

 Farmers do this before the 19th installment of PM Kisan.

19th installment of PM Kisan.

PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడతకు ముందు రైతులు ఈ పని చేయండి.. లేకుంటే డబ్బులు రావు!

Farmers do this before the 19th installment of PM Kisan.

రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో రైతులు ఏటా మూడు విడతలుగా అందుకుంటారు. ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు వస్తాయి. అంటే రైతులకు ఏడాదికి రూ.6,000 అందుతుంది. ఈమేరకు ప్రభుత్వం 18వ విడత పథకం విడుదల చేసింది. 18వ విడత రైతుల ఖాతాలకు 5 అక్టోబర్ 2024న బదిలీ చేసింది. దీని వల్ల 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. ఇప్పుడు కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన 19వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలాఖరులోగా 19వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.

ఈ-కేవైసీ అవసరం:

e-KYC ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. పీఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం ఈ-కేవైసీ తప్పనిసరి. ఇ-కెవైసి ప్రక్రియను పూర్తి చేయని రైతులు పథకం ప్రయోజనాలను పొందలేరు. రైతులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇ-కెవైసిని పొందవచ్చు. ఇది కాకుండా, వారు ఆన్‌లైన్‌లో భూమి కి సంబంధించి డాక్యుమెంట్‌ను సమర్పించాలి.

ఇ-కేవైసీ ఎలా చేయాలి?

  • ముందుగా పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)కి వెళ్లండి.
  • దీని తర్వాత, e-KYC ఎంపిక కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి.
  • ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై OTP వస్తుంది. ఓటీపీని నమోదు చేయండి.
  • సమర్పించిన తర్వాత e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

మొబైల్ నంబర్ సహాయంతో పీఎం కిసాన్ యోజనకు లాగిన్ అయిన తర్వాత, మీరు భూమి ధృవీకరణ ఎంపికకు వెళ్లి భూమి పత్రాలను సమర్పించవచ్చు. ప్రభుత్వం పథకం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు ల్యాండ్ వెరిఫికేషన్, e-KYC చేయకపోతే, మీరు పథకం ప్రయోజనాలను కోల్పోతారు.

లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయండి:

మీరు e-KYC చేసినట్లయితే, మీరు పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు. జాబితాలోని పేరును తనిఖీ చేసిన తర్వాత, తదుపరి విడతలో మీకు ప్రయోజనం లభిస్తుందో లేదో మీకు తెలుస్తుంది. లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయడానికి, మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇప్పుడు లబ్ధిదారుల జాబితా ఎంపికకు వెళ్లి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం మొదలైన వివరాలను పూరించండి. దీని తర్వాత పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీ పేరును చెక్ చేసుకోవచ్చు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.