TG Govt Digital Health Cards: Women are owners of digital health cards

 TG Govt Digital Health Cards: Women are owners of digital health cards.

TG Govt Digital Health Cards : డిజిటల్ హెల్త్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.

TG Govt Digital Health Cards: Women are owners of digital health cards. TG Govt Digital Health Cards : డిజిటల్ హెల్త్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.

ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. డిజిట‌ల్ హెల్త్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని స్పష్టం చేశారు. మిగతా వారి వివరాలను కార్డు వెనక ఉంచాలని సూచించారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం సూచ‌న‌ల మేరకు కార్డుల రూపకల్పన జరగాలని దిశానిర్దేశం చేశారు.

డిజిటల్ హెల్త్ కార్డు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు:

కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని సూచించారు. 

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు (ఎఫ్‌డీసీ) సంబంధించి రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వ‌ర‌కు రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో ప‌ర్య‌టించిన అధికారులు చేసిన అధ్య‌య‌నంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. 

కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు ప‌లు ఆదేశాలు, సూచ‌న‌లు ఇచ్చారు. 

ప్ర‌స్తుతం ఉన్న రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధార‌ణ చేయాల‌ని సూచించారు. ఇత‌ర రాష్ట్రాల కార్డుల రూప‌క‌ల్ప‌న‌, జారీలో ఉన్న మేలైన అంశాల‌ను స్వీక‌రించాల‌ని, లోపాల‌ను ప‌రిహారించాల‌న్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అన‌వ‌స‌ర స‌మాచారం సేక‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు.

పైలెట్‌గా రెండు ప్రాంతాల్లో...!

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు స‌మాచార సేక‌ర‌ణ‌.. వాటిల్లో ఏం ఏం పొందుప‌ర్చాలి, అప్‌డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను నివేదిక రూపంలో అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ల‌తో కూడిన మంత్రివ‌ర్గ ఉప సంఘానికి అంద‌జేయాల‌ని సూచించారు.

మంత్రివ‌ర్గ ఉప సంఘం సూచ‌న‌ల మేర‌కు అందులో జ‌త చేయాల్సిన‌, తొల‌గించాల్సిన అంశాల‌ను స‌మ‌గ్ర జాబితా రూపొందించాల‌ని తెలిపారు. అనంత‌రం రాష్ట్రంలోని 119 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ప్రాంతాలు ఒక గ్రామీణ‌, ఒక ప‌ట్ట‌ణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాల‌ని సీఎం సూచించారు. (పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రామాలు, పూర్తిగా ప‌ట్ట‌ణ‌/న‌గ‌ర ప్రాంతాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వార్డులు/ డివిజ‌న్లను ఎంపిక చేస్తారు.) 

కుటుంబాల నిర్ధ‌ార‌ణ‌, ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వివ‌రాల‌కు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబ‌రు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి (డోర్ టూ డోర్‌) ప‌రిశీల‌న చేయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  సూచించారు. పైలెట్ ప్రాజెక్టును ప‌క‌డ్బందీగా చేపట్టాల‌ని.. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, ప‌ట్ట‌ణ‌/న‌గ‌ర ప్రాంతాల్లో జోన‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారిని ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నియ‌మించాల‌ని దిశానిర్దేశం చేశారు.

ప్ర‌తి ఉమ్మ‌డి జిల్లాకు ఇటీవ‌ల వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వేసిన సీనియ‌ర్ అధికారుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులుగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న స‌మ‌గ్రంగా క‌చ్చిత‌త్వంతో చేప‌ట్టాల‌ని, ఎటువంటి లోపాల‌కు తావులేకుండా చూడాల‌ని హెచ్చ‌రించారు. 

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.