If you know that there is so much power in pomegranate leaves, you will be amazed
Pomegranate Leaves : ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా.. తెలిస్తే నివ్వెరపోతారు
దానిమ్మ పండు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. కానీ పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నిజం. ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. తరచుగా వచ్చే కాలానుగుణ దగ్గు. జలుబు నుండి ఉపశమనం పొందడానికి ఈ పండు యొక్క ఆకుల కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి. ఇవే కాకుండా వివిధ రకాల చిన్న ఆరోగ్య సమస్యలకు దానిమ్మ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి..
ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి, చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ ఆకులు నిద్రలేమికి బెస్ట్ రెమిడీ అని చెబుతారు. ఒక పాత్రలో మూడు వంతుల నీరు తీసుకోండి. దానిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి అందులో నీళ్లలో వేసి.. వాటర్ సగానికి తగ్గే వరకు బాగా మరిగించాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. ఇది మీకు నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
మీరు దురద, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే నయమవుతుంది. అంతేకాదు శరీరంలోని పుండ్లు, గాయాలకు దీన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది.
చెవి ఇన్ఫెక్షన్లు, నొప్పితో బాధపడేవారు దానిమ్మ ఆకులను చూర్ణం చేసి దాని రసాన్ని తీసి, నువ్వులు లేదా ఆవనూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని రెండు చెవుల్లో వేయాలి. ఇలా చేస్తే చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
ఎవరికైనా నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, నోటిపూత ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
అలాగే ముఖంపై మొటిమలు తగ్గాలంటే దానిమ్మ ఆకులను పేస్ట్ లా చేసి మొటిమల మీద రాస్తే ముఖం మచ్చలు లేకుండా తయారవుతుంది.
మీరు తరచుగా అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే, రోజూ రెండు టీస్పూన్ల దానిమ్మ ఆకుల రసం తీసుకోండి లేదా ఈ ఆకులను జీలకర్ర, మిరియాలతో మెత్తగా చేసి పెరుగుతో తాగాలి.
గమనిక: ఈ టిప్స్ ఫాలో అయ్యేముందు వైద్యుడిని సంప్రదించండి.