Train reservation

 IRCTC : Train reservation.. can be done five minutes before.. how.. 

IRCTC : ట్రైన్ రిజర్వేషన్.. ఐదు నిమిషాల ముందూ చేసుకోవచ్చు.. ఎలా అంటే.. 

IRCTC : Train reservation.. can be done five minutes before.. how..  IRCTC : ట్రైన్ రిజర్వేషన్.. ఐదు నిమిషాల ముందూ చేసుకోవచ్చు.. ఎలా అంటే..

IRCTC Train Reservation : ఎక్కడికైనా ప్రయాణం అయినపుడు మరీ ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినపుడు తప్పనిసరిగా రైలులో వెళ్లడం జరుగుతుంది. రైలు ప్రయాణం (Train Journey) అంటే మామూలు విషయం కాదు. రిజర్వేషన్ లేకుండా రైలు ఎక్కడం అంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం మూడు నెలల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించింది భారతీయ రైల్వే. ఒకవేళ అకస్మాత్తుగా వెల్లసిన ప్రయాణం అయితే ఒకరోజు ముందుగా కొద్దిగా ఎక్కువ చార్జీలతో తత్కాల్ బుకింగ్ (Tatkal Booking) కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ, అప్పటికపుడు ప్రయాణం అవ్వాల్సిన అత్యవసర పరిస్థితిలో ఏమి చేయాలి. జనరల్ ఎక్కి ప్రయాణం చేసే పరిస్థితి ఉండదు. రిజర్వేషన్ బుకింగ్స్ 24 గంటల ముందే తాత్కాల్ రూపంలో క్లోజ్ అయిపోతాయి. ఇది ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి. కానీ, ఇప్పుడు మన ప్రయాణానికి 5 నిమిషాలు ముందుగా (అంటే ట్రైన్ బయలుదేరడానికి) కూడా టికెట్ రిజర్వ్ చేసుకోగలిగే అవకాశం ఉంది. ఇది చాలామందికి తెలీదు కూడా. మరి ఇలా టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది తెలుసుకుందాం.

IRCTC :  చాలామంది వ్యక్తులు మూడునెలల ముందుగా లేదా చాలా ముందుగా తమ ప్రయాణం ప్లాన్ చేసుకుంటారు. అయితే, అనివార్య కారణాలతో చివరి నిమిషంలో జర్నీ క్యాన్సిల్ చేసుకుంటారు. అటువంటి టికెట్స్ ఎవరైనా చివరి నిమిషంలో బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎలా అంటే.. ప్రతి ట్రైన్ బయలుదేరడానికి కొద్దిగా ముందుగా రెండు రిజర్వేషన్ ఛార్ట్స్ విడుదల చేస్తుంది రైల్వే. మొదటి చార్ట్ రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు.. రెండో చార్ట్ ఆ రైలు స్టార్టింగ్ కి అరగంట ముందు తయారు చేస్తారు. అందుకే ఇంతకు ముందు ట్రైన్ బయలు దేరడానికి అరగంట ముందు వరకూ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని ఐదు నిమిషాల ముందు వరకూ మార్చారు. ట్రైన్ స్టార్ట్ కావడానికి ఐదు నిమిషాల ముందు కూడా ఇప్పుడు మనం వెల్లసిన రైలు లో సీట్లు ఖాళీ ఉంటె టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి ఆన్ లైన్.. ఆఫ్ లైన్ లో కూడా చేసుకోవచ్చు. మనం స్టేషన్ కు కాస్త ముందు చేరుకొని.. కరెంట్ రిజర్వేషన్ బుకింగ్ లో మనం వెళ్లాల్సిన ట్రైన్ లో సీట్లు ఖాళీ ఉన్నదీ లేనిదీ చెక్ చేసుకుని ఖాళీ ఉంటె టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్ లైన్ లో కూడా టికెట్ చూసుకోవచ్చు. అదెలానో చూద్దాం.. 

IRCTC Train Reservation : ముందు సీట్స్ ఖాళీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. 

ఇండియన్ రైల్వేస్ ప్రిపేర్ చేసే Online చార్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు 

IRCTC యాప్ లో కూడా ఈ సదుపాయం ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి చార్ట్ వెకెన్సీ అనే ఐకాన్ క్లిక్ చేస్తే చార్ట్ చూడవచ్చు. 

ఇక్కడ  ట్రైన్‌ పేరు/నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలను ఎంటర్ చేయాలి 

తరువాత గెట్ చార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి 

అందులో అన్ని తరగతుల చార్ట్ కనిపిస్తుంది. సీట్ల ఖాళీల వివరాలూ కనిపిస్తాయి. సీట్లు ఖాళీ లేకుంటే జీరో కనిపిస్తుంది 

అప్పుడు మీరు సీట్లు ఖాళీ ఉంటె అక్కడ నుంచే టికెట్ బుక్ చేసుకోవచ్చు. 

రైలు ప్రారంభం అయ్యే స్టేషన్ వారికీ ఈ సదుపాయం చాలాబాగా ఉపయోగపడుతుంది. రైలు ప్రయాణించే మార్గం మధ్యలో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు రైలు ప్రారంభ స్టేషన్ లో చార్ట్ ప్రిపేర్ సమయాన్ని బట్టి అప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.