(November19)Veeravanita Rani Jhansi Lakshmibai

 Veeravanita Rani Jhansi Lakshmibai

భరతమాత నుదుట సింధూరం - వీరవనిత రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి

Veeravanita Rani Jhansi Lakshmibai

భరతమాత నుదుట సింధూరం, భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికై యుద్ధభూమిలో  ఆంగ్లేయులను ప్రాణభయంతో పరుగులెత్తించిన వీరవణిత, తన తుదిశ్వాస వరకు భారతీయ సంస్కృతిని, పౌరుషాన్ని కాపాడిన "మణికర్ణిక" వీరనారి ఝాన్సీ లాక్ష్మీభాయ్.

చిన్నపుడే తల్లి చనిపోయింది.  తండ్రి  పెంచాల్సిన పరిస్థితి. అతి చిన్న వయసుల్లోనే పెళ్లి చేసారు. విషాదం పుట్టిన కొడుకు చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక  భర్త  మరణం. అడుగడుగునా కష్టాలు. దత్తత కొడుకు ను వీపున  కట్టి, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో గుర్రపు కళ్లెం పట్టుకొని యుద్ధం లోకి దిగింది. కన్న తల్లిల తన రాజ్యాన్ని, రాజ్య ప్రజలను రక్షించాలని బ్రిటిష్ వారితో  వీర పోరాటం  చేసింది. ఇప్పటికి మనము ఆమె గురుంచి  పాఠ్య పుస్తకాలలో చదువుకుంటున్నాం.

మనందరికీ ఆమె స్ఫూర్తి దాయకం. ధైర్యము, పరాక్రమము, మరియు వివేకము అన్ని కళకలిసిన ఆమె గూర్చి  చెప్పాలంటే మాటలు సరిపోవు. భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా మహిళా సమూహాన్ని తయారు చేసిన గొప్ప వనిత. మొట్టమొదటి స్వతంత్ర  పోరాటంలో పోరాడిన వీరవనిత, ఆమె చేసిన త్యాగాలు  ఎప్పటికి మరువనివి. కానీ చివరకు  వీర మరణం పొందింది. ఆమె మరణము ఫై ఎన్నో అనుమానులున్నాయి.  బ్రిటిష్ వారి తూటాలకు  బలి  అయ్యిందా? లేక తనకు తానే ఆత్మ హత్య చేసుకుందా? గ్వాలియర్ యుద్ధంలో  దొరికిన శవము ఆమెది కాదు అని బహిరంగ ప్రకటనే జరిగింది. ఆమె మరణం వెనుక ఉన్న అసలు కథఏంటి...?

ఝాన్సీ లక్ష్మీబాయి’ అసలు పేరు మణికర్ణిక. మహారాష్ట్ర కు చెందిన సతారలో  1828వ సంవత్సరము నవంబరు నెల19 వంశంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు, వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. కానీ ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నపుడే  కన్ను మూయడం తో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరో పంత్, ఝాన్సీ లక్ష్మీబాయి బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. బాజీరావు కు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్ యొక్క పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ వీరిద్దరూ లక్ష్మీబాయిని తమ చెల్లెలిగా చూసుకునేవారు. వీరుముగ్గురూ కలిసే కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలన్నీ నేర్చుకునేవారు. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి కూడా దుసుకొని పోయేది.

ఇక ఆమె వివాహం విషయానికొస్తే...

1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే వివాహమైంది. దీంతో అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి పిలిచారు. లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్ను మూయడం తో  లక్ష్మీబాయి, గంగాధరరావులు  దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కన్న కుమారుడి మరణం నుంచి తేరుకోలేక, పగిలిన హృదయముతో చాలా బాధ పడుతూ  ఆ తర్వాత గంగాధర్ చనిపోయాడు.

హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా,దామోదర్ రావు , గంగాధర్ రావుకు రక్త సంబంధం కానందువలన సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. రాణి దీనికి ఒప్పుకోలేక లండన్ కోర్టులో దావా వేసింది. కానీ  కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులు రాణి మీద కక్ష పెంచుకొని గంగాధర్ రావు తీసుకున్న అప్పుకు  వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె వెంటనే ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.

రాణి ఝాన్సీ పట్టణంని బ్రిటిష్ వారికీ ఇవ్వకూడదని పోరాటానికి సిద్దపడింది. 1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మలిచింది .లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమకూర్చి సైన్యాన్ని బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇచ్చింది.

1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. రెండు వారాల పోరాటం తర్వాత లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది.

ఆ తర్వాత కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారునితో  చేయి కలిపి  మరింత బలగాన్ని పెంచుకుంది. రాణి మరియు తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసిందట. కానీ  బ్రిటిష్ వారు తరువాత మళ్ళి కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. 1858 జూన్ 17లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది.

యుద్ధంలో ఝాన్సీ మరణించలేదా...?

కానీ ఈమె యుద్ధం లో మరణించలేదని, ఝాన్సీ  కోట నుండి తప్పించుకున్నాక ప్రతాప్ గడ్ రాజు ఆశ్రయమిచ్చి, అక్కడి నుండి నేపాల్కి  వెళ్లే ఏర్పాట్లు  చేసాడట. మరియు  1915 లో సహజ సిద్ధంగ మరణించిందని చెప్తుంటారు.

ఇంకా చెప్పాలి అంటే బ్రిటిష్ బుల్లెట్స్ కి మరణించించింది. అచ్చం ఝాన్సీలక్ష్మి భాయ్ ల ఉండే ఝల్కారిబాయి అని, ఝాన్సీలక్ష్మి భాయ్ మహిళా సైన్యం లో ఉండే  గొప్పవనిత  ఝల్కారిబాయి అని VL Varma “ఝాన్సీ ఫై రాణి”  అనే పుస్తకం లో  ప్రపంచానికి తెలియ పరిచారు.

స్త్రీ శక్తి దివాస్ ‌:

స్త్రీ శక్తి దివాస్‌ గా స్వాతంత్ర్య సమర యోధురాలు,బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి జరుపుతున్నారు.

అమెరికా వార్తాపత్రికలో....

అమెరికా వార్తాపత్రిక వారు 100ఏండ్ల_కింద ఝాన్సీరాణీ ధీరత్వాన్ని గుర్తించి ఆమెను హీరోయిన్ ఆఫ్ ద వార్ అనగా యుద్ధ నాయకురాలు అని సగర్వంగా ప్రకటించింది.

రిత్ర లో ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పతనాన్ని  గుర్తించి భారతీయులుగా గర్వించాలి.

చివరగా ఆమె పోరాటానికి  గుర్తుగా వీర వనిత ఝాన్సీలక్ష్మి భాయ్ గుర్రం పైన కూర్చున్నట్లుండె  కంచు విగ్రహాలు ఝాన్సీ మరియు గ్వాలియర్ లో  ఏర్పాటు చేసారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.