Premium compact SUV for Rs. 8 lakhs.. Dusty features.. ADAS technology

Premium compact SUV for Rs. 8 lakhs.. Dusty features.. ADAS technology

రూ.8 లక్షలకే ప్రీమియం కాంపాక్ట్ SUV.. దుమ్మురేపే ఫీచర్స్.. ADAS టెక్నాలజీ
Premium compact SUV for Rs. 8 lakhs.. Dusty features.. ADAS technology


KIA New Sonet Adas: కియా కంపెనీ కార్లు ఓ రేంజ్‌లో ఉంటాయని అందరికీ తెలుసు. ఈ కంపెనీ కార్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టైలిష్ లుక్, సరికొత్త ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఈ కంపెనీ మరో కొత్త కారును తెచ్చింది.

ఇండియాలో ప్రీమియం కార్లను ఉత్పత్తి చేస్తూ దూసుకెళ్తున్న కియా కంపెనీ.. సరికొత్త ప్రీమియం కాంపాక్ట్ SUV నూ సోనెట్ (New Sonet)ను ADAS టెక్నాలజీతో తీసుకొచ్చింది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

డిసెంబర్ 2023లో ఈ కారును ఆవిష్కరించింది. కియా కార్లలో సోనెట్, రెండో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న కారు. ఇదే సోనెట్‌ని సరికొత్తగా తీర్చిదిద్దిన కంపెనీ.. 25 భద్రతా ఫీచర్లతో తీసుకొచ్చింది.

ఈ కారులో 10 ఆటోమేటిక్ ఫీచర్లతోపాటూ, అత్యుత్తమ ADAS, బలమైన 15 హై-సేఫ్టీ ఫీచర్లున్నాయి. అలాగే ఈ వాహనం 70కి పైగా కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లను కూడా కలిగివుంది.

ఈ కారులో 5 డీజిల్ వేరియంట్ల ఎక్స్ షోరూమ్ ధర రూ.9.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మొత్తంగా 19 విభిన్న వేరియంట్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

ఈ కారుకు 360 డిగ్రీ కెమెరాతోపాటూ.. క్లస్టర్‌లో బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఉంటుంది. ఈ కారుకు వెనకవైపు స్లీక్ బ్లాక్ సర్ఫేస్ ఇచ్చారు. అలాగే స్పోర్టీ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే టైగర్ నోస్ గ్రిల్స్.. వైల్డ్ లుక్ ఇస్తోంది

ఈ కారులో ఒక్క టచ్‌తో అన్ని డోర్లనూ కంట్రోల్ చెయ్యవచ్చు. ఐతే.. ఏదైనా ఆపద వచ్చినప్పుడు.. ఆటో స్టాప్ ఆప్షన్ కూడా ఉంది.

రోడ్ ట్రిప్‌లలో సీనిక్ ఎడ్వెంచర్ కోసం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఇచ్చారు. ఇంకా క్రౌన్ జెవెల్ LED హెడ్ ల్యాంప్స్, స్టార్ మ్యాప్ LED DRLs ఆకట్టుకుంటున్నాయి.

ఈ కారులో స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇది వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కారులో ఫ్యూయల్ ఎఫీషియంట్ ఇంజిన్స్, మల్టిపుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల.. కస్టమర్లు తమకు నచ్చిన కాంబినేషన్ ఎంచుకునే వీలుంది.

ఈ కారుకు శక్తిమంతమైన స్మార్ట్ స్ట్రీమ్ 1.0 T – GDi పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 88 kW పవర్, 172 Nm టార్క్ ఇస్తుంది. అలాగే 1.5 CRDi VGT డీజిల్ ఇంజిన్.. 85 kW పవర్, 250 Nm టార్క్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా 6 స్పీడ్ అడ్వాన్స్ AT ట్రాన్స్‌మిషన్ ఇచ్చారు.

సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్‌తోపాటూ.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), బ్లైండ్ వ్యూ మానిటర్ (BVM) వంటివి ఉన్నాయి. వీటికి తోడుగా అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్ 1 మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తోంది. 

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.