Nuclear Battery: Those batteries for smartphones..if charged once it will work for 50 years!

 Nuclear Battery: Those batteries for smartphones..if charged once it will work for 50 years!

Nuclear Battery: స్మార్ట్‌ఫోన్లకు ఆ బ్యాటరీలు..ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 50 ఏళ్ల వరకు పని చేస్తుంది!

Nuclear Battery: Those batteries for smartphones..if charged once it will work for 50 years!


భవిష్యత్తులో అసలు మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కేవలం రూపాయి బిళ్ల కంటే చిన్న స్థలంలో 63 న్యూక్లియర్ ఐసోటోప్‌లను కలిగి ఉండే బ్యాటరీలు రూపొందుతున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే, ఏకంగా 50 సంవత్సరాల వరకు పవర్‌ బ్యాకప్ అందిస్తాయని ఒక టెక్ స్టార్టప్ తెలిపింది.

Nuclear Battery: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనే ముందు చాలా రకాల ఫీచర్లు పరిశీలిస్తున్నారు. కెమెరా స్పెసిఫికేషన్లు, ప్రాసెసర్‌, సైజ్‌ ముఖ్యంగా బ్యాటరీ కెపాసిటీని చూస్తున్నారు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌, ఎక్కువ సేపు బ్యాకప్‌ ఇచ్చే మోడళ్లను కొంటున్నారు. అయితే భవిష్యత్తులో అసలు మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కేవలం రూపాయి బిళ్ల (15x15x5 క్యూబిక్ మిల్లీమీటర్ల సైజ్‌) కంటే చిన్న స్థలంలో 63 న్యూక్లియర్ ఐసోటోప్‌లను కలిగి ఉండే బ్యాటరీలు రూపొందుతున్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే, ఏకంగా 50 సంవత్సరాల వరకు పవర్‌ బ్యాకప్ అందిస్తాయని ఒక టెక్ స్టార్టప్ పేర్కొంది.

టెక్నీలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత యుగంలో, అందరూ బ్యాటరీతో రన్‌ అయ్యే గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ డివైజ్‌లను ఒకటి లేదా రెండు రోజుల్లో పదే పదే ఛార్జ్ చేయాలి. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ బీజింగ్ బేస్డ్‌ స్టార్టప్ బీటావోల్ట్ కొత్త రకం బ్యాటరీలను రూపొందిస్తోంది. అటామిక్‌ ఎనర్జీ బ్యాటరీలను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లు, డ్రోన్‌లలో కమర్షియల్‌ పర్పస్‌ కోసం పెద్ద ఎత్తున వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఛార్జింగ్ అవసరం లేని ఫోన్‌లు, డ్రోన్‌లను రూపొందించడాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచంలోనే మొదటిసారి అటామిక్‌ ఎనర్జీ (అణు శక్తి) మినియేటరైజేషన్‌ను బ్యాటరీల్లో ఇంప్లిమెంట్‌ చేస్తున్నట్లు బీటావోల్ట్ పేర్కొంది. ఈ అటామిక్ ఎనర్జీ బ్యాటరీలు ఏరోస్పేస్, AI డివైజ్‌లు, మెడికల్ ఎక్విప్‌మెంట్‌, మైక్రోప్రాసెసర్‌లు, అడ్వాన్స్‌డ్‌ సెన్సార్‌లు, స్మాల్‌ డ్రోన్‌లు, మైక్రో-రోబోట్‌లకు శాశ్వతంగా విద్యుత్తు సరఫరా అందిస్తాయని వివరించింది.

ఎక్విప్‌మెంట్‌ 20వ శతాబ్దానికి చెందిన ప్రత్యేక పద్ధతి ద్వారా క్షీణిస్తున్న ఐసోటోపుల నుంచి శక్తిని విద్యుత్తుగా మారుస్తుంది. అప్పటి సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను రూపొందించారు. వీటిని సైంటిఫిక్‌ స్టేషన్లు, అండర్‌ వాటర్‌ డివైజ్‌లు, అంతరిక్ష నౌక, ఇతర పరికరాల్లో ఉపయోగించారు. అయినప్పటికీ ఈ పద్ధతి పెద్ద, ఖరీదైన థర్మోన్యూక్లియర్ బ్యాటరీలను ఉపయోగించింది.

న్యూక్లియర్ బ్యాటరీ 100 మైక్రోవాట్లు, 3V శక్తిని సరఫరా చేయగలదు. వచ్చే ఏడాది నాటికి 1W పవర్ కెపాసిటీ కలిగిన బ్యాటరీలను ప్రవేశపెట్టాలని బీటావోల్ట్ యోచిస్తోంది. ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేని ఫోన్‌లు, డ్రోన్‌లను తయారు చేయాలని కంపెనీ చూస్తోంది. సడన్‌ ఫోర్స్‌ వచ్చినప్పుడు కూడా ఈ యాక్సెసరీలు మంటలు అంటుకోవు లేదా పేలవని తెలిపింది. మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ నుంచి 120 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలలో ఇవి పని చేయగలవని సంస్థ పేర్కొంది. బ్యాటరీ పర్యావరణ అనుకూలమైనది, ఎక్స్‌టర్నల్‌ రేడియేషన్‌ను విడుదల చేయదు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.