NETFLIX: A huge shock for users.. Netflix's key decision!

 NETFLIX: A huge shock for users.. Netflix's key decision!

Netflix: యూజర్లకు భారీ షాక్.. నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం!

NETFLIX: A huge shock for users.. Netflix's key decision!

Netflix: ప్రముఖ గ్లోబల్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లలో మార్పులు చేసింది. కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సబ్‌స్క్రైబర్‌లు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఒకప్పుడు కొత్త సినిమాలు ముందు థియేటర్‌లోకి వచ్చాక, ఆ తర్వాత టీవీలో ప్రసారమయ్యేవి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఓటీటీ వేదికగానే చాలా సినిమాలు, సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఆఫర్‌ చేస్తున్న కంటెంట్‌ ఆధారంగా స్ట్రీమింగ్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లు రూపొందిస్తున్నాయి.

తాజాగా ప్రముఖ గ్లోబల్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లలో మార్పులు చేసింది. కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సబ్‌స్క్రైబర్‌లు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. భారతదేశంలోని సబ్‌స్క్రైబర్‌లపై కూడా కంపెనీ నిర్ణయం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా బడ్జెట్ ధరలో అందిస్తున్న $11.99 (సుమారు రూ.962.59) నెలవారీ యాడ్‌-ఫ్రీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. దీంతో ఇప్పుడు $15.99 ప్లాన్‌ (దాదాపు రూ.1,282.62) చౌకైన యాడ్-ఫ్రీ ఆప్షన్‌గా మారింది. రెండు ప్లాన్‌ల మధ్య చాలా తేడా కనిపిస్తోంది. మరోవైపు వాలెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లు కోరుకునే వారి కోసం, నెట్‌ఫ్లిక్స్‌ యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను నెలకు కేవలం $6.99 (దాదాపు రూ.560.37)కే అందిస్తోంది.

2023 నాలుగో త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌ యాడ్‌-సపోర్టెడ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో 70% త్రైమాసిక వృద్ధిని సాధించింది. యాడ్‌ సపోర్ట్‌ మార్కెట్స్‌లో కొత్త, తిరిగి చేరే సబ్‌స్క్రైబర్‌ల కోసం బేసిక్‌ ప్లాన్‌ను క్రమంగా తొలగించడంతో ఈ వృద్ధి సాధ్యమైంది. ఈ మార్కెట్లలో మొత్తం సైన్-అప్‌లలో ఇప్పుడు యాడ్-సపోర్టెడ్ ప్లాన్ 40% వాటాను కలిగి ఉందని నెట్‌ఫ్లిక్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

తాజా మార్పులను రెండో త్రైమాసికంలో కెనడా, యునైటెడ్‌ కింగడమ్‌తో ప్రారంభించి, ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. యాడ్‌-సపోర్టెడ్‌ దేశాలలో కూడా బేసిక్‌ ప్లాన్‌ను తొలగించాలని స్ట్రీమింగ్ సర్వీస్ యోచిస్తోంది.

ఈ స్ట్రాటజీ నెట్‌ఫ్లిక్స్ విస్తృత లక్ష్యంలో భాగంగా కనిపిస్తోంది. రెవిన్యూ మార్గాలను డైవర్సిఫై చేయడం, ట్రెడిషినల్‌ సబ్‌స్క్రిప్షన్‌లకు మించి యాడ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంపై కంపెనీ దృష్టి పెట్టింది. తక్కువ-ధర, యాడ్-సపోర్టెడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఎంచుకోవడం లేదా ఎక్స్‌పెన్సివ్‌, ప్రీమియం ప్లాన్‌లు పొందేలా వ్యూవర్స్‌ను కంపెనీ ప్రోత్సహిస్తోంది. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్ ధరను అక్టోబర్‌లో $22.99 (దాదాపు రూ.1,843.30)కి పెంచింది.

ఈ సబ్‌స్క్రిప్షన్ మార్పులు చేస్తున్న క్రమంలోనే.. నెట్‌ఫ్లిక్స్ WWEతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ ఏకంగా $5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.500 కోట్లు). ఈ ఒప్పందంతో WWE లైవ్ వీక్లీ రెజ్లింగ్ షో, మండే నైట్‌ రా ప్రసారం చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక హక్కులను పొందింది. కంటెంట్‌ పరంగా నెట్‌ఫ్లిక్స్‌ తీసుకొచ్చిన అతిపెద్ద మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ తన సబ్‌స్క్రిప్షన్ మోడ్స్‌ని మాడిఫై చేస్తూ, ప్రత్యేకమైన కంటెంట్ ఒప్పందాలలో పెట్టుబడి పెడుతోంది. భారతదేశంలో కూడా ఈ పోకడతో త్వరలో మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.