How to fix network problem

 How to fix network problem

How to fix network problem

మీ ఫోన్ లో నెట్ వర్క్ సమస్య ఉందా?వెంటనే ఈ 4 సెట్టింగ్స్ మార్చుకోండి..స్పీడ్ పెరుగుతుంది

ఫోన్‌లో నెట్‌వర్క్ సరిగ్గా పని చేయకపోతే కొన్ని సెట్టింగ్‌లను మార్చడం ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు. నెట్‌వర్క్ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఇక్కడ చూడండి.

ఫోన్‌లో సరైన ఇంటర్నెట్ లేకపోతే దాదాపు అన్ని పనులు ఆగిపోతాయి. వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటే, ఏదైనా పని చేయడం చాలా సులభం అవుతుంది. కొన్నిసార్లు మనకు చాలా ముఖ్యమైన పని ఉన్నప్పుడే ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా సార్లు పేలవంగా మారుతుండటం అనేక సార్లు మనం చూసి ఉంటాం. అయితే కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడం ద్వారా నెట్‌వర్క్‌ సమస్యను పరిష్కరించవచ్చు. నెట్‌వర్క్‌లో సమస్య ఉంటే ఏమి చేయాలో చూడండి.

Restart:  కొన్నిసార్లు బ్యాడ్ లేదా వీక్ కనెక్షన్‌ని పరిష్కరించడానికి  రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. పునఃప్రారంభించడం(Restart) పని చేయకపోతే.. Wi-Fi, మొబైల్ డేటా మధ్య మారండి. దీన్ని చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి  నెట్‌వర్క్ & ఇంటర్నెట్ లేదా కనెక్షన్‌లను క్లిక్ నొక్కండి. ఇవి మీ డివైజ్ బట్టి వేర్వేరు ప్లేస్ లలో ఉండవచ్చు

దీని తర్వాత, వైఫైని ఆఫ్ చేసి, మొబైల్ డేటాను ఆన్ చేయండి..ఏదైనా తేడా ఉందో లేదో చూడండి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే రివర్స్ లో ప్రయత్నించాలి. అంటే ఈసారి మొబైల్ డేటాను ఆఫ్ చేసి, వైఫైని ఆన్ చేసి, ఏదైనా మార్పు ఉందా అని చూడండి.

చాలా సార్లు సమస్య మొబైల్‌లో ఉండిపోతుంది. ఇది నెట్‌వర్క్ సమస్య అని మనం భావిస్తుంటాం. అందువల్ల, మీరు మీ సిమ్‌ని మరొక మొబైల్‌లో వేయడం,సమస్య కేవలం ఒక డివైజ్ లోనే లేదా అన్ని మొబైల్‌లలో సంభవిస్తుందో లేదో  చెక్ చేయడం ముఖ్యం.

ఫోన్ మార్చిన తర్వాత కూడా సమస్య కొనసాగితే మొబైల్ సెట్టింగ్‌లకు వెళ్లి వైర్‌లెస్ అండ్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి. మొబైల్ నెట్‌వర్క్ ఆప్షన్ ని సెలక్ట్ చేసుకోండి. దీని తర్వాత, నెట్‌వర్క్ ఆపరేటర్‌లపై క్లిక్ చేయండి..నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్ గా ఎంచుకోండి.

ఎయిర్‌ప్లేన్ మోడ్ సహాయపడుతుంది - ఫోన్ మళ్లీ మళ్లీ నెట్‌వర్క్‌ని కోల్పోతే, దాన్ని రీస్టార్ట్ చేయడమే కాకుండా మీరు దానిని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో కూడా ఉంచవచ్చు, ఆపై కొంత సమయం తర్వాత దాన్ని ఆఫ్ చేయవచ్చు. చాలా సార్లు ఇది నెట్‌వర్క్‌ను స్థిరంగా చేస్తుంది.

ఇంత జరిగినా కూడా నెట్‌వర్క్ సరిగా లేకుంటే మీ ఫోన్ లేటెస్ట్ ఓఎస్‌తో అప్‌డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కాకపోతే, మొబైల్‌ని లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేయండి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.