Gmail Hidden Features In Telugu

 Gmail Hidden Features In Telugu

Gmail Hidden Features In Telugu

మీరు వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా జీ-మెయిల్ ఉపయోగిస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. జీ-మెయిల్లో అనేక హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే, చాలా సులువుగా మన పని పూర్తి చేసుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్లో అందరికీ ఉపయోగపడే టాప్-9 హిడెన్ జీ-మెయిల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన జీ-మెయిల్ అతికొద్ది కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. దానికనుగుణంగానే జీమెయిల్ కూడా ఎప్పటికప్పుడు తమ యూజర్లకు నూతన సేవలందిస్తూ వస్తోంది. అయితే ఇందులో ఉన్న కొన్ని బెస్ట్ ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. దానికి కారణం అవి జీ-మెయిల్ అకౌంట్లో అంత సులభంగా కనిపించవు. కానీ వీటి గురించి తెలుసుకుంటే, చిన్నచిన్న తప్పులు జరిగినప్పుడు కంగారు పడకుండా, వెంటనే వాటిని సరిచేసుకోవచ్చు. వేగంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే ఆ హిడెన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం రండి.

1. ఈ-మెయిల్ అన్డూ : కొన్నికొన్ని సందర్భాల్లో పొరపాటున తప్పుడు ఫైల్ అటాచ్ చేసి ఈ-మెయిల్ పంపిస్తుంటాం. అది గమనించేలోపే ఆ సందేశం అవతలివారికి చేరుతుంది. అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి జీ-మెయిల్ అకౌంట్లో ఒక ఫీచర్ ఉంది. దీని కోసం జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్లి అందులోని "Enable Undo Send" అనే అప్షన్కు క్లిక్ చేయండి. దానిలో 5 ,10, 20, 30 సెకన్లలోపు సందేశాన్ని క్యాన్సిల్ చేసే అప్షన్ ఉంటుంది. సాధారణంగా దీనిని 30 సెకన్ల వ్యవధికి సెట్ చేసుకోవడం ఉత్తమం.

2. డెలిగేట్స్ ఫీచర్ : మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లినా, లేదా వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లినా, మీ జీ-మెయిల్ను చూసుకోవడం కష్టం అవుతుంది. ఇతరులను సహాయం కోరదామంటే, పాస్వర్డ్తోపాటు, మన వ్యక్తిగత సమాచారం కూడా తెలిసిపోతుందేమోనని భయం ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా, ఇతరులకు తాత్కాలికంగా మన అకౌంట్ యాక్సిస్ ఇచ్చే 'డెలిగేట్ ఫీచర్' జీ-మెయిల్లో ఉంది. దానిని ఎనేబుల్ చేసుకుంటే, డెలిగేట్స్ మీ జీ-మెయిల్లో మెసెజ్లు పంపడం లేదా తొలగించడం మాత్రమే చేయగలరు. మీ పాస్వర్డ్ మార్చడానికి లేదా ఇతరులతో చాట్ చేయటానికి కానీ వారికి ఎలాంటి అవకాశముండదు.

3. కాన్ఫిడెన్సియల్ మోడ్ :

జీ-మెయిల్లో కాన్ఫిడెన్షియల్ మోడ్ ఉంటుంది. దీనిని వాడటం ద్వారా, మనం పంపిన ఈ-మెయిల్ కొద్దిసేపటి తర్వాత దానంతట అదే తొలగిపోతుంది. అవతలి వ్యక్తి ఈ మెయిల్ను కాపీ, ప్రింట్, ఫార్వార్డ్, డౌన్లోడ్ చేయడం లాంటివి ఏవీ చేయలేడు. ఏదైనా రహస్య సమాచారాన్ని పంపాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించడానికి జీ-మెయిల్లోకి వెళ్లి, కంపోజ్ను క్లిక్ చేసి, కాన్ఫిడెన్షియల్ మోడ్ను ఎనేబుల్ చేసుకోవాలి.

4. స్పెల్ చెక్

సాధారణంగా ఈ-మెయిల్ చేసేటప్పుడు అక్షరదోషాలు వస్తుంటాయి. అయితే తొందరపాటులో వాటిని మనం గుర్తించం. అందుకే స్పెల్ చెక్ను యాక్టివేట్ చేయటం ద్వారా మెయిల్లో ఏవైనా లోపాలుంటే, వాటిని సరిచేసుకోవడానికి వీలవుతుంది.

5. ఆటో రెస్పాండర్

మీరు 2,3 నెలల పాటు జీ-మెయిల్ను ఉపయోగించనట్లయితే, వెకేషన్ ఆటో-రెస్పాండర్‌ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా మీకొచ్చే మెయిల్కు దానంతట అదే రిప్లై ఇస్తుంది. అయితే ఇది మీ కాంటాక్ట్స్లో ఉన్న మెయిల్స్ అడ్రస్లకు మాత్రమే ఆటో-రిప్లై ఇస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.

6. వ్యూ ఈ-మెయిల్స్

కొన్ని సార్లు మన ఇన్బాక్స్ మెుత్తం ఈ-మెయిల్స్తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు అన్ని మెసేజ్లు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. మరికొన్ని సార్లు డిఫాల్ట్గా కనిపించే 50 మెయిల్స్ కన్నా, ఎక్కువ చూడాల్సి వస్తుంది. దీనికోసం జీ-మెయిల్ సెట్టింగ్స్లోకి వెళ్లి డిఫాల్ట్ వ్యూ కాన్వర్జేషన్స్ ఆప్షన్ను క్లిక్ చేసి, మీకు ఇన్బాక్స్లో ఎన్ని మెయిల్స్ కనిపించాలో సెట్ చేసుకోవచ్చు. దీనితో ఒక పేజీలో కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 100 మెయిల్స్ వరకు చూసుకోవచ్చు.

7. కలర్ కోడ్

జీ- మెయిల్లో ఉండే నక్షత్రపు గుర్తుల కోసం మనకు నచ్చిన రంగును ఎంచుకోవచ్చు. ఒకప్పుడు కేవలం యెల్లో కలర్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బ్లూ, గ్రీన్, రెడ్, పర్పుల్ కలర్స్లో మీకు నచ్చిన దానిని సెట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు వచ్చే ఈ-మెయిల్స్ను ప్రాధాన్యత క్రమంలో సెట్ చేసుకోవచ్చు.

8. టెంప్లెట్స్

మనం చాలా మందికి ఈ-మెయిల్స్ పంపిస్తూ ఉంటాం. బల్క్గా పంపించాల్సి వచ్చినప్పుడు, ప్రతిసారీ టైప్ చేసిందే, టైప్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే ధన్యవాదాలు, శుభోదయం లాంటి రెగ్యూలర్ పదాలకు జీ -మెయిల్లో ఉండే టెంప్లెట్స్ను ఉపయోగించవచ్చు. దీని వల్ల మీరు ప్రతిసారీ రిపీటెడ్గా వీటిని కంపోజ్ చేసే అవసరం ఉండదు. పైగా సమయం కూడా ఆదా అవుతుంది.

9. ఆఫ్లైన్ యాక్సెస్

మనం ఏవైనా ప్రయాణాలు చేయాల్సివచ్చినప్పుడు అక్కడ ఇంటర్నెట్ సరిగ్గా ఉంటుందో, లేదో తెలియదు. అటువంటి సమయంలో ఆఫ్లైన్ మోడ్ను ఉపయోగించవచ్చు. దీని కోసం సెట్టింగ్స్లోకి వెళ్లి, ఆఫ్లైన్ మోడ్ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనితో మీరు ఎన్ని రోజులు ఆఫ్లైన్లో మెసేజ్లు చూడాలని అనుకుంటున్నారో, అన్ని రోజులను సెట్ చేసుకోవచ్చు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.