Galaxy S24: Samsung's new phones with amazing features.. with a discount of Rs. 22 thousand!

Galaxy S24: Samsung's new phones with amazing features.. with a discount of Rs. 22 thousand!

Galaxy S24:మతిపోయే ఫీచర్లతో శాంసంగ్ కొత్త ఫోన్స్.. ఏకంగా రూ.22 వేల తగ్గింపుతో!

Galaxy S24: Samsung's new phones with amazing features.. with a discount of Rs. 22 thousand!

దిగ్గజ టెక కంపెనీ శాంసంగ్‌ మరో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలనే మార్కెట్‌లోకి తెచ్చింది. ఇటీవలనే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ పేరుతో నేడు ఈ ఫోన్లను విడుదల చేశారు. ఈ సిరీస్ లో Samsung Galaxy S24, Galaxy S24 ప్లస్, Galaxy S24 అల్ట్రా పేర్లతో మూడు మోడల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అధునాతన ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయమైన ధర ఈ ఫోన్స్ ప్రత్యేకత. ఓ సారి ఈ ఫీచర్స్ చూద్దాం.

చాట్ జీపీటీ తర్వాత ఇప్పుడు అంతా ఏఐ ట్రెండ్ నడుస్తోంది. అందుకే అనుగుణంగానే కంపెనీ ఈ ఫోన్‌లో గెలాక్సీ ఏఐ అనే అదిరే జనరేటివ్ ఏఐ ఫీచర్ తీసుకువచ్చింది. కంపెనీ దీని ద్వారా యూజర్లకు మెరుగైన ఏఐ సర్వీసులు అందించాలని భావిస్తోంది. నేటివ్ యాప్స్‌లో గెలాక్సీ ఏఐ వినియోగం ద్వారా కస్టమర్లకు సూపర్ ఫీచర్లు అందుబాటులో ఉంచాలని చూస్తోంది. శాంసంగ్ కంపెనీ గూగుల్ జెమిని ఏఐ సాయంతో ఈ సేవలు తీసుకువచ్చింది. శాంసంగ్ నోట్స్, వాయిస్ రికార్డర్, కీబోర్డు యాప్స్, ఫోటో గ్యాలరీ, మెసిజింగ్, ఫోటో ఎడిటింగ్ వంటి యాప్స్‌లో ఏఐ వినియోగంతో అదిరే సర్వీసులు యూజర్లకు లభించనున్నాయి. రౌండ్ ఇట్ ఫైండ్ అనే ఫీచర్ కూడా ఉంది.

ఇంకా ఈ శాంసంగ్ గెలాక్సీ ఏఐ ద్వారా లైవ్ ట్రాన్స్‌లేట్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, ఆండ్రాయిడ్ ఆటో, ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్, ఎడిట్ సజిషన్స్, జనరేటివ్ ఎడిట్, ఇన్‌స్టంట్ స్లో మోషన్ వంటి పలు రకాల ఫీచర్లను కూడా ఏఐ ద్వారా పొందే వెసులుబాటు ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్24లో 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. 4000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఈ అల్యూమినియం మెటీరియల్ తో ఈ ఫోన్ తయారు చేయబడి ఉంటుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్24+, ఎస్24 అల్ట్రాలో 6.7 ఇంచ్- 6.8 ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లేలు ఉంటాయి. ఎస్24, ఎస్24+లో 50ఎంపీ ప్రైమరీ, 10ఎంపీ టెలిఫొటో, 12ఎంపీ అల్ట్రా వైడ్ ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉంటాయి.

ఇకపోతే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో QHD రెసొల్యూషన్, టిటానియం ఫ్రేమ్ ఉంటుంది. 200ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ టెలిఫొటో, 10ఎంపీ టెలిఫొటో, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ తో 8కే రిసొల్యూషన్ క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో 5000MAh బ్యాటరీ ఉంటుంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ ఉంటుంది.

గెలాక్సీ ఎస్‌24- ఎగ్జినోస్‌ 2400 ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ.79,999, అలాగే 8GB+512GB వేరియంట్ ధర రూ.89,999. గెలాక్సీ ఎస్‌24+ - ఎగ్జినోస్‌ 2400 ఫోన్ 12GB+256GB వేరియంట్ ధర రూ.99,999 అలాగే 12GB+512GB వేరియంట్ ధర రూ.1,09,999. గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా 12GB+256GB ధర రూ.1,29,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ మోడల్ ఫోన్లలో ఎన్నో అద్భుతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్లలో ఏడేళ్ల ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ తో పాటు 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్ ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ ప్రిబుకింగ్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.22 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. 256 జీబీ వేరియంట్ ధరకే 512 జీబీ వేరియంట్ పొందొచ్చు. అంటే అప్పుడు రూ.10 వేల బెనిఫిట్ వస్తుంది. ఇక అప్‌గ్రేడ్ బోనస్ కింద రూ. 5 వేలు, అలాగే రూ.7 వేల శాంసంగ్ ఇవోచర్ ఉంటుంది. లేదంటే రూ.5 వేల అప్‌గ్రేడ్ బోనస్, రూ.5 వేల బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు.

అలాగే గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్‌పై ఏడాది పాటు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. లేదంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 69,999తో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు ఈ ఫోన్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.