Apple Watch: Bringing Apple Watch from America is a waste.. because..?
Apple Watch: యాపిల్ వాచ్‌ను అమెరికా నుంచి తెప్పించుకోవడం వేస్ట్.. ఎందుకంటే..?
Apple Watch: యాపిల్ వాచ్‌ను ఇప్పుడు అగ్రరాజ్యం నుంచి తెప్పించుకోవడం కంటే మన దేశంలోనే కొనుగోలు చేయడం బెస్ట్. ఎందుకో తెలుసుకోండి.
విదేశాల్లో చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న స్నేహితులు, బంధువులు ఉంటే.. వారు భారత్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఏవైనా గాడ్జెట్స్ తీసుకురమ్మని ఇక్కడి వారు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ లిస్టులో ఖరీదైన యాపిల్ కంపెనీ ఐఫోన్‌లు, యాపిల్ వాచ్‌లు, ఇతర ప్రొడక్టులు ఉంటాయి. అమెరికాతో పోలిస్తే వీటి ధర భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది యూఎస్ నుంచి ఐఫోన్లు, వాచ్‌లు తెప్పించుకుంటారు. అయితే యాపిల్ వాచ్‌ను ఇప్పుడు అగ్రరాజ్యం నుంచి తెప్పించుకోవడం కంటే మన దేశంలోనే కొనుగోలు చేయడం బెస్ట్. ఎందుకో తెలుసుకోండి.
ఇటీవల పేటెంట్ వివాదం కారణంగా యూఎస్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 మోడళ్ల అమ్మకాలను యాపిల్ నిలిపేయాల్సి వచ్చింది. చివరకు వీటిని విక్రయించడానికి కంపెనీకి అనుమతులు లభించినా, అక్కడ బ్లడ్ ఆక్సిజన్ హెల్త్ ఫీచర్‌ను డిసేబుల్ చేయాల్సి వచ్చింది. అంటే ఒకవేళ తక్కువ ధరకు వస్తుందని అమెరికాలో కొని భారతదేశంలో వాటిని యూజ్ చేయవచ్చు. కానీ కీలక హెల్త్ ఫీచర్‌ను కోల్పోతారు. ఈ ఫీచర్ కావాలంటే భారతదేశంలో లేదా నిషేధం లేని ఇతర ప్రాంతాల్లో యాపిల్ వాచ్‌లను కొనుగోలు చేయాలి.
యాపిల్ కంపెనీ అమెరికాలోని స్టోర్‌లకు షిప్పింగ్ చేస్తున్న కొత్త యాపిల్ మోడళ్లకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది. యూఎస్‌లో కొని, భారతదేశానికి తీసుకురావడం ద్వారా మీరు ఆదా చేసే రూ.5,000 నుంచి రూ.10,000కు, డివైజ్‌లో ముఖ్యమైన ఫీచర్ కోల్పోవాల్సి వస్తుంది.
భారతదేశంలో 45mm యాపిల్ సిరీస్ 9 మోడల్ కొనాలనుకుంటే, బ్యాంక్ ఆఫర్లతో అది రూ.42,000కి లభిస్తుంది. అయితే అమెరికాలో అదే మోడల్‌కు రూ.35,000 మాత్రమే ఖర్చవుతుంది. కానీ ఇది ట్యాక్స్‌లకు ముందు కాస్ట్. పన్నులు కలిపితే ఆ అమౌంట్‌కి మరో రూ.3,000 నుంచి రూ.4,000 వరకు యాడ్ అవుతుంది. కాబట్టి చివరికి భారతదేశం, యూఎస్ ధరల మధ్య కేవలం రూ.3,000 తేడా మాత్రమే ఉంటుంది.
యాపిల్ సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్‌లకు పేటెంట్ సమస్య ఎదురైంది. బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ కొలిచే ఫీచర్ విషయంలో తమ పేటెంట్‌ను యాపిల్ ఉల్లంఘించిందంటూ మాసిమో కార్పొరేషన్ పిటిషన్ ఫైల్ చేసింది. దీంతో ఈ రెండు మోడళ్లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (ITC) అక్టోబర్‌లో నిషేధం విధించింది. విక్రయాలపై డిసెంబర్ 26 నుంచి నిషేధం అధికారికంగా అమల్లోకి వచ్చింది.
అందుకే మీరు యాపిల్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తే, ప్రత్యేకించి బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ కోరుకుంటే భారతదేశంలోనే వాటిని కొనుగోలు చేయడం మంచిది. ఈ టూల్స్ యాక్సెస్ చేయడానికి ప్రీమియం ధర చెల్లించకుండానే అన్ని ఫీచర్లను అవుట్ ఆఫ్ ది బాక్స్ పొందవచ్చు.