Telangana Assembly Elections Live Updates:
తెలంగాణ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్
Telangana Assembly Elections Live Updates: తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. మంగళవారం సాయంత్రానికి ప్రచారానికి తెరపడనుంది. సమయం ఎక్కువగా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూడా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ తరపున ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. బహిరంగ సభలతో పాటు రోడ్‌షోలు చేస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించి.. బీజేపీ తరపున ప్రచారం చేశారు.