Snake like Lizard

 Snake like Lizard

 42 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన అరుదైన జీవి.. సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్న శాస్త్రజ్ఞులు..

Snake like Lizard


ఈ వింత జీవిని క్వీన్స్‌లాండ్ మ్యూజియం పరిశోధకులు, జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా కనుగొన్నారు. ఈ అరుదైన సరీసృపాన్ని లియోన్స్ గ్రాస్‌ల్యాండ్ స్ట్రిప్డ్ స్కింక్ అని అంటారు. ఈ వింత జీవి ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది. ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ జీవి పాములాంటి బల్లి.  ఆస్ట్రేలియాలోని  కైర్న్స్‌ నగరానికి దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ సర్‌ప్రైజ్ సమీపంలో 5 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో కనుగొన్నారు.మానవుల స్వార్థం వల్ల ప్రకృతిలోని అనేక జీవులు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. నేల, నింగి, నీరు ఇలా ప్రతి చోటా అనేక జీవులు అంతరించిపోతున్నాయి. అందుకనే అప్పుడప్పుడు ఎక్కడైనా వింత జీవి కనిపిస్తే చాలు ఆశ్చర్య పోతాం.. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను ఇతరులతో పంచుకుంటూ దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తాం.. అదే సమయంలో శాస్త్రజ్ఞులు కూడా ఆ జీవిగురించి పరిశోధిస్తారు. దాని గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. ప్రస్తుతం భూమి ఉన్న ఓ వింత జీవి గురించి  ప్రజల్లో చర్చనీయాంశమైంది. 42 ఏళ్ల క్రితం కనుమరుగైన ఈ జీవి మళ్ళీ కనిపించింది. ఈ జీవిని చివరిసారిగా 1981లో చూసినట్లు చెబుతున్నారు.ఈ వింత జీవిని ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ మ్యూజియం పరిశోధకులు, జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా కనుగొన్నారు. ఈ అరుదైన సరీసృపాన్ని లియోన్స్ గ్రాస్‌ల్యాండ్ స్ట్రిప్డ్ స్కింక్ అని అంటారు. ఈ వింత జీవి ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది.ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ జీవి పాములాంటి బల్లి.  ఆస్ట్రేలియాలోని  కైర్న్స్‌ నగరానికి దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ సర్‌ప్రైజ్ సమీపంలో 5 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో కనుగొన్నారు. ఈ బల్లి మాత్రమే కాదు మరో రెండు అరుదైన బల్లులు కనుగొన్నారు.

ఈ జాతి ఎందుకు అదృశ్యమైంది?

ఈ జీవులను చూసిన డాక్టర్ ఆండ్రూ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ బల్లులు అంతరించిపోయే దశలో ఉన్నాయని .. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయని ఈ బల్లులు దొరకడం చాలా కష్టమని చెప్పారు. ఆశ్చర్యకరంగా అరుదైన ఈ బల్లులు ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. ఈ మూడింటిని ఈ విధంగా చూడటం నిజంగా ఒక ఉత్తేజకరమైన క్షణం అని పరిశోధకులు తెలిపారు. తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని చెబుతున్నారు. మట్టిలో ఈత కొట్టడానికి వీలుగా తమ అవయవాలను మార్చుకుంటాయి. అంతేకాదు వీటి శరీర నిర్మాణం ఇసుక నేలలకు అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు.

పాము వంటి బల్లి

ఈ బల్లుల అంతరించుపోవడానికి కారణం ఎక్కువగా మానవ తప్పిదాలే అని చెబుతున్నారు. ఇక్కడి అడవులలో చాలాసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయని.. అందుకనే అరుదైన ఈ బల్లుల జనాభా తగ్గిందని నిపుణులు చెప్పారు. ఇది కాకుండా కరువు కారణంగా చాలా చోట్ల అంతరించిపోయింది. ఇది ఇటీవల క్వీన్స్‌లాండ్, ఆస్ట్రేలియన్ ప్రభుత్వాలు అత్యంత ప్రమాదంలో ఉన్న.. అంతరించి పోతున్న జీవుల  జాబితాలో చేర్చాయి.
Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.