iQOO 12 Bloatware-free
ఇక ఐక్యూ 12లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఉండవు.. త్వరలో వస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
స్మార్ట్‌ఫోన్లలో యూజర్లకు అవసరం లేని ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ కంపెనీలో అందించడం కామన్ అయిపోయింది. బ్లోట్‌వేర్ (Bloatware) అని పిలిచే ఈ యాప్స్ చికాకు పుట్టించే యాడ్స్ డిస్‌ప్లే చేస్తాయి, స్టోరేజీ స్పేస్ కూడా ఆక్రమిస్తాయి. ఎక్కువగా చైనీస్ ఫోన్లలో అనవసరమైన ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఉంటాయి. వీటి పట్ల యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ (iQOO) కస్టమర్లకు ఇబ్బంది లేకుండా అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 12 (iQOO 12) నుంచి బ్లోట్‌వేర్‌ను తీసివేయాలని కీలక నిర్ణయించుకుంది. ఈ ఫోన్ 2023, డిసెంబర్ 12న భారతదేశంలో లాంచ్ కానుంది.
ఐక్యూ 12లో హాట్ యాప్‌ల వంటి యాప్‌లు ఉండవు, ఇంతకుముందు ఐక్యూ డివైజ్‌ల్లో ఇచ్చిన హాట్ యాప్‌లు యాడ్స్ చూపించి యూజర్ ఎక్స్‌పీరియన్స్ బాగా దెబ్బతీసాయి. అప్‌కమింగ్ ఐక్యూ మొబైల్‌లో ఈ సమస్య ఉండదు. ఐక్యూ 12 అందించే మెరుగుదల అది మాత్రమే కాదు. ఇది మూడు మేజర్ OS అప్‌డేట్స్, అలానే చాలా కాలం పాటు రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఆఫర్ చేస్తుంది. అంటే ఫోన్ సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్‌డేట్ అవుతుంది.