Are you in debt? But follow this wonderful principle..!
Nowadays money plays a vital role in human life. It is a well-known fact that money is needed in every aspect and every thing from birth to death.
అప్పుల పాలవుతున్నారా?అయితే ఈ అద్భుతమైన సూత్రం పాటించండి..!
ప్రస్తుత రోజుల్లో మనిషి జీవితంలో డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి విషయం, ప్రతి అంశంలోనూ సొమ్ము అవసరం ఉంటుందనేది జగమెరిగిన సత్యం.
అందుకే తన జీవితంలో ఎక్కువ శాతం మనిషి డబ్బు సంపాదించడానికే ప్రాకులాడుతూ ఉంటాడు. అయితే ఎంత కష్టపడినా కొన్నిసార్లు ధనం అవసరాల మేరకు ఉండకపోవడం, వచ్చినా వృథాగా ఖర్చుకావడం లాంటివి జరుగుతుంటాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అప్పుల భారీన పడతారు. ఇందుకు ఇంటి వాస్తు కూడా కొంత కారణమవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయాన్నే లేచి మీరు ఈ చిట్కాలు పాటిస్తే ధనం ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో అపారమైన సంపద వస్తుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో చూద్దాం..
ధనమేలే అన్నింటికీ మూలం..
* వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ముఖద్వారం ఎంత ప్రాముఖ్యంగా ఉంటే దాని ప్రకారం ఇంట్లో ధనం ఆ విధంగా పెరుగుతుంది. అంటే ఇంట్లో ఎల్లప్పుడు సంపద ఉండాలంటే ముఖద్వారానికున్న ప్రధాన తలుపుకు ముదురు రంగును వేయాలి. అలా అని నలుపు రంగును ఉపయోగించకూడదు. ఎరుపు, ముదురు ఎరుపు రంగును వేయాలి. ఫలితంగా ఇంట్లో సంపద పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.
* ఉదయాన్నే మెయిన్ డోర్ తెరిచేముందు లక్ష్మీదేవిని మనసులో తలచుకొని తెరిస్తే అంతా శుభమే జరుగుతుంది.
మధ్యవర్తిత్వం వహించడం..
* గుర్తుంచుకోండి.. అప్పుల ఇప్పించే విషయంలో ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వం వహించొద్దు. పొరపాటున కూడా ఎవరికైనా డబ్బుల విషయంలో ష్యూరిటీ ఇచ్చారా? అంతే సంగతి. వారు కట్టకపోతే ఆ భారం మన మీద పడుతుంది. దీంతో మనం జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల్లో పడిపోవడం గ్యారెంటీ. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా మధ్యవర్తిగా ఉండి సంతకం పెట్టడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అప్పుల్లో తప్పకుండా కూరుకుపోతారు.
ఆన్ లైన్ చెల్లింపుల అవగాహన..
* పిల్లలతో ఆన్ లైన్ చెల్లింపుల పట్ల అవగాహన పెంచకూడదు. అలా చేస్తే మనకు తెలియకుండా వారు అలాంటి ప్రయత్నాలు చేస్తే మనకు బిల్లులు వస్తాయి. దీంతో మీరు ఇంకా అప్పుల భారం మోయాల్సి వస్తుంది. అందుకే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం గురించి చెప్పకూడదు.
* చిన్న పిల్లల ముందు అప్పుల విషయాలు చర్చించకూడదు. మనకు వచ్చే డబ్బుల గురించి మాట్లాడకూడదు. వారి ఎదుట వచ్చే డబ్బులు, పోయే డబ్బుల గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఇలా చేస్తేవారికి చదువుపై శ్రద్ధ పెట్టరు. మా తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారా అని ఆలోచిస్తూ.. వారు చదువుపై చొరవ తీసుకోరు. దీని కారణంగా చిన్న పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి.