White Hair To Black Hair: White hair turns black in a week with hibiscus flowers for sure.
Currently, many people are using products with chemicals available in the market to make their hair thick and strong.
White Hair To Black Hair: మందార పువ్వుతో తెల్ల జుట్టు వారంలో నల్లగా మారడం ఖాయం వివరాలు.
ప్రస్తుతం చాలా మంది జుట్టు ఒత్తుగా, దృఢంగా చేసుకోవాడినికి మార్కెట్‌లో లభించే రసాయానాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు.
అయితే వీటిని వినియోగించడం వల్ల ఫలితాలు పొందిన కొంత కాలం వరకే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మందార పువ్వు ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఎర్ర మందార పువ్వుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని వల్ల జుట్టు మెరవడమేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మందార పువ్వును పొడి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మందార పువ్వులో ఉండే గుణాలు:
మందార పువ్వులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, యాంటీమైక్రోబయల్ వంటి పోషకాలు లభిస్తాయి. జుట్టుకు దీన్ని అప్లై చేయడం వల్ల వెంట్రుకలకు అన్ని రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా దీనిని టీగా చేసుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీని తాగాలి. అంతేకాకుండా ఈ టీని జుట్టు కూడా అప్లై చేయడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
మందార పువ్వుల హెయిర్ మాస్క్ తయారీ విధానం
మందార పువ్వుల హెయిర్ మాస్క్ తయారీ చేయడానికి ముందుగా మందార పువ్వు పొడిని తీసుకుని అందులో రోజ్ వాటర్, కొబ్బరి నూనెను వేసి మిక్స్ చేసి జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
పొడి జుట్టు మెరిసేలా కనిపించేందుకు ఇలా చేయండి
చాలా మందిలో పొడి జుట్టు కారణంగా వెంట్రుకలు నిర్జీవంగా మారుతున్నాయి. అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు పైన పేర్కొన్న మిశ్రమాన్ని కూడా వినియోగించవచ్చు. అంతేకాకుండా మందార పువ్వులను పేస్ట్‌లో అలోవెరా జెల్ కలపడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.