Watermelon: పుచ్చకాయను కొనేప్పుడు ఏది బావుందో, ఏది బాలేదో ఇలా కనిపెట్టేయండి.

 Watermelon: Find out what's good and what's not when buying watermelon.

Watermelon: Find out what's good and what's not when buying watermelon.

Think of cucumber to cook curry.. Some people will give it after seeing it bitter and bitter, no problem. Now it is summer season. Watermelons which are good for the body due to their water content are widely available in the market.

Even children like to eat them. But some precautions should be taken before buying watermelons. We are going to give you some tips to know which ones are better sweet and which ones are red and taste better. If you follow these, you can select almost 99% good watermelon.

Watermelon: పుచ్చకాయను కొనేప్పుడు ఏది బావుందో, ఏది బాలేదో ఇలా కనిపెట్టేయండి.

కూర వండుకోవడానికి దోసకాయ అనుకోండి.. కొంతమంది తీపో, చేదో చూసి ఇచ్చేస్తారు నో ప్రాబ్లమ్. ఇకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్. వాటర్ కంటెంట్ ఉండి.. శరీరానికి మేలు చేసే పుచ్చకాయలు మార్కెట్‌లో విరివిగా లభిస్తాయి.

వీటిని పిల్లలు సైతం ఇష్టంగా తింటారు. అయితే పుచ్చకాయలు కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది స్వీట్‌గా బాగుంటుందో, ఏది ఎర్రగా, మంచి రుచితో ఉంటాయో ఉంటుందో తెలుసుకోడానికి మీకు మేము కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాం. వీటిని ఫాలో అయితే.. దాదాపు 99%మంచి పుచ్చకాయను సెలెక్ట్ చేసుకోవచ్చు.

పుచ్చకాయలో ఆడ, మగ జాతులు కూడా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. తియ్యటి కాయ కావాలంటే… పొడవుగా ఉన్న కాయ కన్నా గుండ్రం వున్నా కాయను ఎన్నుకోండి.

కాయ అడుగు భాగం చూడండి.. అక్కడ పసుపు రంగు ఉంటే అది చాలా తీపిగా ఉంటుంది, తెల్లగా ఉంటే మీడియం స్వీట్ అన్నమాట

తొడిమను చూడండి.. అది ఎండిపోయి ఉంటే అది బాగా పక్వానికి వచ్చింది అని గుర్తు. (తొడిమ పచ్చగా ఉంటే.. ఆ కాయ తీసుకోకండి )

తొడిమకు అటువైపు ఎండ్‌లో అంటే.. పువ్వు వచ్చే వద్ద.. మచ్చలు ఉంటే దాని పైన ఎక్కువ తేనెతీగలు వాళ్లినట్టు లెక్క. అంటే పోలీనేషన్ ఎక్కువ జరిగినట్టు.. అది చాలా స్వీట్‌గా ఉంటుంది.

కంప్లీట్‌గా పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయలే రుచిగా ఉంటాయి.

పుచ్చకాయను కొనేముందు దానిపై వేళ్లతో కొట్టినప్పుడు టక్ టక్ అని శబ్దం వస్తే ఆ కాయ బాగా పండిందని చెప్పొచ్చు. అదే శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందని అర్థం.

పుచ్చకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. మరి తియ్యగా వస్తే మాత్రం ఆ కాయను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాయ ముదర పండి.. మురిగిపోయేందుకు దగ్గరలో ఉందని అర్థం.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.