Temple Bells : ఆలయాలలో గంటలను ఎందుకు అమరుస్తారో తెలుసుకుందాం. 2023

 Temple Bells: Let's know why bells are installed in temples.

Temple Bells: Let's know why bells are installed in temples.

There are many ancient temples in our country. Each temple has its own significance. In each temple in our country, different types of pooja and prasad are performed.

Almost every temple has big bells installed for everyone to see. That is why all the devotees who come to the temple keep ringing the bell. Many people say that by doing this, all the devotees are relieved of their stress due to their various problems and become very calm.

Temple Bells : ఆలయాలలో గంటలను ఎందుకు అమరుస్తారో తెలుసుకుందాం.

మన దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటాయి. మనదేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయాలలో ఒక్కొక్క రకమైన పూజలు, ప్రసాదాలు చేస్తూ ఉంటారు.

దాదాపుగా ప్రతి ఆలయంలోనూ ఖచ్చితంగా అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద గంటలను అమరుస్తూ ఉంటారు. అందుకే గుడికి వచ్చిన భక్తులందరూ గంట ద్వారా శబ్దం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల భక్తులందరికీ వారి రకరకాల సమస్యల వల్ల ఉన్న ఒత్తిడి తగ్గి ఎంతో ప్రశాంతత ఏర్పడుతుందని చాలామంది ప్రజలు చెబుతారు.

అన్ని రకాల వాస్తు దోషాలు కూడా గంట మోగించడం ద్వారా తొలగిపోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. గంట శబ్దం క్రమం తప్పకుండా ఎక్కడ వస్తుందో అక్కడ వాతావరణం ఎప్పుడు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల భక్తుల వంద జన్మల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతూ ఉంటారు.

గంట మోగించడం ద్వారా దేవతల ముందు మీ హాజరు పడుతుందని చాలామంది చెబుతారు. గంట శబ్దం కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైన వాటిని నాశనం చేస్తాయి అని చెబుతూ ఉంటారు. లయబద్ధమైన గంట శబ్దం మనసు మనసు నుండి ఉద్విగ్యతను తొలగించి శాంతినిస్తుంది.

నిరంతరం గంటను మోగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయని వేద పండితులు చెబుతారు. కాలచక్రానికి ప్రతికగా గంటను చాలామంది ఈ భావిస్తారు. ఆలయంలోని దేవతలకు పూజ అయిపోయిన తర్వాత గంటను మోగించడం హారతినిస్తారు. అలాగే మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు తమ ఇంట్లో కూడా పూజలు చేసి హారతి ఇచ్చేటప్పుడు గంటను మోగిస్తూ ఉంటారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.