SBI Quick: Details of 10 free services SBI customers can avail over the phone.
With the development of technology, online services have become available in many fields.
The fastest of all these changes took place in the banking sector. Now almost all banks are providing services through special mobile applications. But State Bank of India (SBI) is providing an opportunity to get banking services without internet just by missed call or messages.
Now SBI is offering many mobile services free of cost to the customers through the Kwik app. Account balance and mini-statement can be obtained with the help of Missed Call Banking. Or you can also get various services by sending SMS from the registered mobile number to specific mobile numbers using predefined keywords. Details of 10 services that SBI customers can get for free on the phone.
SBI Quick: ఎస్‌బీఐ కస్టమర్‌లు ఫోన్‌లో ఉచితంగా పొందగలిగే 10 సేవలు వాటి వివరాలు.
టెక్నాలజీ అభివృద్ధితో చాలా రంగాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అన్నింటికంటే వేగంగా ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా సేవలు అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ లేకుండా కేవలం మిస్డ్‌కాల్ లేదా మెసేజ్‌ల ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).
ఇప్పుడు కస్టమర్లకు ఎస్‌బీఐ క్విక్ యాప్ ద్వారా అనేక మొబైల్ సేవలను ఉచితంగా అందిస్తోంది. మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సాయంతో అకౌంట్ బ్యాలెన్స్, మినీ-స్టేట్‌మెంట్ పొందవచ్చు. లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి నిర్దిష్ట మొబైల్ నంబర్లకు ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉపయోగించి SMS పంపించి కూడా వివిధ సేవలను పొందవచ్చు.ఎస్‌బీఐ కస్టమర్‌లు ఫోన్‌లో ఉచితంగా పొందగలిగే 10 సేవల వివరాలు
ఎస్‌బీఐ మినీ స్టేట్‌మెంట్ : రీసెంట్‌గా నిర్వహించిన ఐదు ట్రాన్సాక్షన్‌ల మినీ స్టేట్‌మెంట్ కోసం ఎస్‌బీఐ కస్టమర్ 919223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా ఇదే నంబర్‌కు 'MSTMT' అని SMS పంపవచ్చు.
6 నెలల ఎస్‌బీఐ ఇ-స్టేట్‌మెంట్ : మెసేజ్ ద్వారా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 6 నెలల ఇ-స్టేట్‌మెంట్ పాస్‌వర్డ్ ఎన్‌క్రిప్టెడ్ PDF ఫైల్ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి వస్తుంది. ఇందుకు 917208933145 నంబర్‌కు 'ESTMT <అకౌంట్ నంబర్> అని మెసేజ్ పంపాలి.
ఎస్‌బీఐ బ్యాలెన్స్ ఎంక్వైరీ : అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కస్టమర్లు 919223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా ఇదే నంబర్‌కు 'BAL' అని SMS పంపవచ్చు.
ఎస్‌బీఐ చెక్ బుక్ రిక్వెస్ట్ అక్నాలడ్జ్‌మెంట్ : ఈ సేవలు పొందేందుకు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి 917208933145 నంబర్‌కు "CHQREQ" అని మెసేజ్ పంపాలి.
ఎస్‌బీఐ చెక్ బుక్ రిక్వెస్ట్ : చెక్ బుక్ కోసం 917208933145 నంబర్‌కు "CHQREQ" అని టైప్ చేసి SMS సెండ్ చేయాలి.
ఎస్‌బీఐ ఎన్రోల్ పాజిటివ్ పే సిస్టమ్ (PPS) ఎన్రోల్ పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ని ఉపయోగించే ముందు ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మొబైల్ సేవలను పొందవచ్చు.
ఎస్‌బీఐ సర్వీసెస్ లిస్ట్ : మెసేజ్ ద్వారా ఎస్‌బీఐ అందిస్తున్న సర్వీసెస్ లిస్ట్‌ను అందుకోవచ్చు. 917208933145 నంబర్‌కి HELP అని మెసేజ్ పంపాలి.
లాంగ్వేజ్ ఛేంజ్(హిందీ/ఇంగ్లీష్) : లాంగ్వేజ్ ఛేంజ్ చేయడానికి (హిందీ/ఇంగ్లీష్).. అవసరమైన లాంగ్వేజ్ పేరు టైప్ చేసి 917208933148కి మెసేజ్ పంపాలి.
ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ : ఫోన్ మెసేజ్ ద్వారా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్‌ని చెక్ చేయవచ్చు. 917208933145 నంబర్‌కు ELI <అకౌంట్ నంబర్> అని మెసేజ్ చేయాలి.
హోమ్ లోన్ ఇంట్రస్ట్ సర్టిఫికేట్ : ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హోమ్ లోన్ ఇంట్రస్ట్ సర్టిఫికేట్‌ను కూడా చెక్ చేయవచ్చు. ఇందుకు 917208933145 నంబర్‌కు HLI <అకౌంట్ నంబర్> అని SMS సెండ్ చేయాలి.
ఎస్‌బీఐ క్విక్ సర్వీస్ కోసం యూజర్లు సైన్ అప్ చేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ సేవలకు కచ్చితంగా అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్‌నే వినియోగించాలి. ఆండ్రాయిడ్, విండోస్, iOS లేదా బ్లాక్‌బెర్రీ ఫోన్‌ని కలిగి ఉంటే సంబంధిత యాప్ స్టోర్ నుంచి ఎస్‌బీఐ క్విక్ యాప్‌ను పొందవచ్చు. ఎస్‌బీఐ క్విక్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉపయోగించవచ్చు.