SBI రిక్రూట్మెంట్ 2023

 ఎస్బిఐ రిక్రూట్మెంట్ 2023: విశ్రాంత బ్యాంకు సిబ్బందికి 1031 ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్వైజర్ & సపోర్ట్ ఆఫీసర్ ఖాళీలు – జీతాభత్యాలు నెలకు రూ. 36,000 - రూ. 41,000

ఎస్బిఐ రిక్రూట్మెంట్ 2023: విశ్రాంత బ్యాంకు సిబ్బందికి 1031 ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్వైజర్ & సపోర్ట్ ఆఫీసర్ ఖాళీలు – జీతాభత్యాలు నెలకు రూ. 36,000 - రూ. 41,000

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విశ్రాంత బ్యాంకు సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకొనేందుకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వెయ్యికి పైగా ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గతంలో బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం కలిగి, ఆసక్తి కలిగినవారు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 1,031

1. ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్: 821 ఖాళీలు

2. ఛానల్ మేనేజర్ సూపర్వైజర్: 172 ఖాళీలు

3. సపోర్ట్ ఆఫీసర్: 38 ఖాళీలు

వయస్సు: గరిష్ఠంగా 63 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2023 నాటికి కనీసం 60 ఏళ్లు; రిజర్వేషన్లకు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు కల్పిస్తారు. దేశంలో కేటాయించిన చోట ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

ఏటీఎం ఆపరేషన్స్ లో పనిచేసిన అనుభవం కలిగినవారికి ఎక్కువ ప్రాధాన్యం.

ఎంపిక విధానం: దరఖాస్తులను షార్టిస్ట్ చేసి.. వాటిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి పోస్టింగ్ ఇస్తారు.

జీతాభత్యాలు:

• ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్- నెలకు రూ. 36,000

• ఛానెల్ మేనేజర్ సూపర్వైజర్- నెలకు రూ. 41,000

• సపోర్ట్ ఆఫీసర్- నెలకు రూ. 41,000

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01-04-2023

దరఖాస్తుకి చివరి తేదీ: 30-04-2023   

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.