IRCTC Helicopter Services: కేదార్‌నాథ్ ధామ్‌కు ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సేవలు... ఇలా బుక్ చేయాలి.

 IRCTC Helicopter Services: IRCTC Helicopter Services to Kedarnath Dham should be booked as...

IRCTC Helicopter Services: IRCTC Helicopter Services to Kedarnath Dham should be booked as...

Good news for devotees going to Kedarnath Dham. Indian Railway Catering and Tourism Corporation (IRCTC) is going to provide helicopter services to Kedarnath Dham.

The Yatra will begin with the opening of the Yamunotri and Gangotri temples on April 22. Kedarnath Dham 2023 will start on 25th April. Badrinath temple will open on April 27. Lakhs of devotees come for this yatra. It is estimated that more than 2 lakh devotees have already registered to participate in the Char Dham Yatra. Devotees going to Kedarnath can book IRCTC Helicopter Services.

IRCTC Helicopter Services: కేదార్‌నాథ్ ధామ్‌కు ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సేవలు... ఇలా బుక్ చేయాలి.

కేదార్‌నాథ్ ధామ్ వెళ్లే భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ సేవల్ని అందించబోతోంది.

ఏప్రిల్ 22న యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ ధామ్ 2023 ఏప్రిల్ 25న ప్రారంభం కానుంది. బద్రీనాథ్‌ ఆలయం ఏప్రిల్‌ 27న తెరుచుకోనుంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వస్తుంటారు. చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొనడానికి ఇప్పటికే 2 లక్షలకు పైగా భక్తులు రిజిస్టర్ చేసుకున్నారని అంచనా. కేదార్‌నాథ్ వెళ్లే భక్తులు ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సేవల్ని (IRCTC Helicopter Services) బుక్ చేసుకోవచ్చు.

కేదార్‌నాథ్‌కు భక్తులు హెలికాప్టర్ సేవల్ని ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా https://heliyatra.irctc.co.in/ వెబ్‌సైట్ రూపొందించింది ఐఆర్‌సీటీసీ. ఏప్రిల్ 1న బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. మార్చి 31 లోపు ట్రయల్ రన్ పూర్తవుతుంది. ఆ తర్వాత బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. యాత్రికుల భద్రత కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల ప్రకారం హెలికాప్టర్ ఆపరేటర్లు పని చేస్తారు.

ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సేవల్ని బుక్ చేసుకునేముందు భక్తులు టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్, స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ వాట్సప్ సర్వీస్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పర్యాటకు Yatra అని టైప్ చేసి 918394833833 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్ని వివరాలు ఎంటర్ చేయాలి.

చార్‌ధామ్ యాత్రకు ఇప్పటివరకు 5.97 లక్షల రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. అందులో కేదార్‌నాథ్‌కు 2.2 లక్షల రిజిస్ట్రేషన్స్, బద్రీనాథ్‌కు 1.9 లక్షల రిజిస్ట్రేషన్స్, గంగోత్రికి 88,521 రిజిస్ట్రేషన్స్, యమునోత్రికి 87,352 రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. 2022లో 45 లక్షల భక్తులు ఈ నాలుగు ఆలయాలను దర్శించుకున్నారని అంచనా. అందులో 17.6 లక్షల మంది భక్తులు బద్రీనాథ్‌కు, 15.6 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు, 6.2 లక్షల మంది భక్తులు గంగోత్రికి, 4.8 లక్షల మంది భక్తులు యమునోత్రికి వచ్చారు. ఈసారి కూడా ఇదే స్థాయిలో భక్తులు చార్‌ధామ్ యాత్రకు వస్తారని అంచనా.

ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్ ప్యాకేజీలు

ఐఆర్‌సీటీసీ టూరిజం చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. న్యూ ఢిల్లీ, హరిద్వార్, ముంబై, రాయ్‌పూర్ నుంచి ఈ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.55,000. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు 11 రోజుల పాటు చార్‌ధామ్ యాత్రకు వెళ్లొచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.