Hyderabad: Dangerous chemical in packet milk.. Shocking things come to light during inspections.
Adulteration has become commonplace wherever we look.. From the food we eat to the drinking water and milk, everything is getting adulterated. It is worrying.
Recently, people are getting worried after knowing the news that the milk being sold to the public is adulterated. At the same time, the officials found that the chemical used on dead bodies was being added to the milk. This matter came to light during the inspections conducted by food safety officers in Yadadri Bhuvanagiri district. Officials confirmed that the chemical used to preserve the dead bodies was added to the milk. This shocking incident created a commotion all over Telangana including Hyderabad. Officials conducted inspections at a private milk collection center in Kondamadugu of Yadadri Bibinagar mandal. When the milk was tested, it was confirmed that it contains formaldehyde, a chemical used to preserve corpses.
Hyderabad: ప్యాకెట్ పాలలో డేంజరస్ కెమికల్.. తనిఖీల్లో వెలుగులోకి షాకింగ్ విషయాలు.
ఎక్కడ చూసినా కల్తీ అనేది సర్వసధారణంగా మారింది.. తినే ఆహార పదర్థాల నుంచి .. తాగే నీరు, పాలు వరకూ అన్ని కల్తీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా.. ప్రజలకు అమ్ముతున్న పాలు కల్తీ అన్న వార్త తెలిసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏకంగా శవాలను వాడే కెమికల్‌ను పాలల్లో కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నట్లు అధికారులు నిర్దారించారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ సహా.. తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. యాదాద్రి బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాలను పరీక్షించగా.. దానిలో శవాలను భద్రపరచడానికి ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను ఉపయోగిస్తున్నట్లు నిర్దారణ అయింది.
పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పగిలిపోకుండా ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను ఉపయోగిస్తున్నట్లు పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు కడెం కుమార్ అంగీకరించాడని అధికారులు తెలిపారు. ఈ కేంద్రానికి రోజూ 600 లీటర్లకు పైగా పాల సరఫరా జరుగుతుందని.. పాలలో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్‌ను కలిపి ఎక్కువ పాలు (కల్తీ) తయారు చేస్తున్నాడని అధికారులు వెల్లడించారు. ఆ పాలను ప్యాక్ చేసి స్థానికంగా విక్రయించడంతోపాటు.. హైదరాబాద్‌లోని పలు పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కుమార్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా పాల వ్యాపారం చేస్తున్న మరో ఇద్దరిపైనా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు పీడియాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని పేర్కొంటున్నారు. అయితే, యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురంలో ఇటీవల కల్తీ పాల వ్యాపారం వెలుగులోకి రాగా.. రెండు రోజుల నుంచి యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు తరలిస్తున్న వాహనాలను ఆపి పాల శాంపిల్స్ సేకరించగా.. విస్తుపోయే విషయాలు వెలగులోకి వచ్చాయి.
కాగా.. పాలలో ఫార్మాల్డిహైడ్ కెమికల్ కలపడంపై అధికారులు స్పందించారు. శవాలు భదపర్చడానికి ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ కెమికల్కలిపిన పాలను ఉపయోగిస్తే వెంటనే ముప్పు లేకున్నా.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని అధికారులు వెల్లడించారు. శ్వాస, జీర్ణకోశ, కాలేయ సంబంధమైన వాధులతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటూ హెచ్చరిస్తున్నారు.