Credit Card: Do you know that credit and debit cards can also be locked?
Credit cards and debit cards are used by many people these days. However, if the credit card user spends beyond the limit, it becomes a burden while paying the bill.
Credit Card : క్రెడిట్ , డెబిట్ కార్డులను కూడా లాక్ చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా ?
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు చాలా మంది వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు వినియోగించేవారు పరిమితిమి మించి ఖర్చు చేస్తే బిల్లు చెల్లించేటప్పుడు భారంగా ఉంటుంది.
టెక్నాలజీ పెరిగిపోతుండటంతో ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలపై పరిమితిని మీరే సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు కార్డు ఉపయోగించిన ప్రతిసారి రూ.5 వేలు లేదా రూ.10 వేలు మించి లావాదేవీలు చేయకూడదు అనుకుంటే దానికి తగినట్లుగా పరిమితిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకు మించి చేసే లావాదేవీలు విఫలమవుతాయి. అంతర్జాతీయ లావాదేవీలను నియంత్రించుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంది.
కార్డును ఎలా సెట్ చేయాలి?
కార్డు పరిమితిని ఏర్పర్చుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బటన్‌ను స్విచ్ ఆన్ చేయడం ద్వారా అనుమతిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా పరిమితిని ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్షన్‌కు వెళ్లి పరిమితి విధించాలనుకుంటున్న కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దేశీయ లావాదేవీల కోసం లేదా అంతర్జాతీయ లావాదేవీల కోసం పరిమితి ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? లేదా ఇతర మార్పులు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అన్న ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే సదుపాయాన్ని కొన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఇలా టెక్నాలజీ పెరిగిపోతుండటంతో బ్యాంకులు కార్డుదారులకు సులభమైన మార్గాలను అందిస్తున్నాయి. బ్యాంకును బట్టి సెట్ చేసుకునే విధానం ఉంటుంది. అవసరం అనుకుంటే మీరు కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి కూడా వివరాలు పొందవచ్చు.
పరిమితి ఎందుకు సెట్ చేసుకోవాలి.?
డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు బ్యాంకులతో పాటు మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రత్యేకించి మీ పాస్‌వర్డ్, పిన్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. మీ కార్డు విత్‌డ్రా లిమిట్‌ను పరిమితం చేయండి.