Do you know where the most expensive bullet proof houses in the world are?
In modern times, building houses for common people has become an unattractive grape. But it is surprising to see the construction of houses built by politicians and business leaders who are recognized all over the world.
While Mukesh Ambani's house is also among the richest houses built with modern technology.. Let's know about the nine best palaces built with the same distinction worldwide and their prices.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ ఇళ్లు.. ఎక్కడుందో తెలుసా?
ఆధునిక కాలంలో సామాన్యులు ఇళ్లు నిర్మించుకోవడం అందని ద్రాక్షగా మారిపోతుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ, వ్యాపార ప్రముఖులు నిర్మించిన ఇళ్ల నిర్మాణాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అత్యంత ధనవంతుల రిచెస్ట్ హౌజెస్‌లో ముఖేష్ అంబానీ ఇల్లు కూడా ఉండగా.. వరల్డ్ వైడ్ అంతే ప్రత్యేకతతో నిర్మించిన తొమ్మిది బెస్ట్ ప్యాలెస్‌లు, వాటి ధరల గురించి తెలుసుకుందాం.
1. బకింగ్‌హామ్ ప్యాలెస్
బ్రిటన్‌కు చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ విలువ రూ. 12.81 కోట్ల పైనే. ఇందులో మొత్తం 775 గదులు, 52 రాయల్ బెడ్‌రూమ్‌లు, 188 స్టాఫ్ బెడ్‌రూమ్‌లున్నాయి. అంతేకాదు 92 కార్యాలయాలతో కూడిన ఈ రాజ భవనం 77 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఈ ప్యాలెస్ లండన్‌లో ఉన్న క్వీన్ ఎలిజబెత్ IIకి చెందినది.
2 . యాంటిలియా
ముఖేశ్ అంబానీ ఇల్లు 'యాంటిలియా' 27 అంతస్తులతో నిర్మించబడింది. ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న ఇంట్లో ఒకేసారి 168 కార్లను పార్క్ చేయడానికి సదుపాయం ఉంది. దీని పైకప్పుపై మూడు హెలిప్యాడ్‌లు కూడా ఉన్నాయి. రూ. 100 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ విలాసవంతమైన బంగ్లాలో ఆలయం, ఉద్యానవనం, హోమ్ థియేటర్, ఆరోగ్య కేంద్రం వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇది 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది.
3. విక్టోరియన్ హౌస్
విక్టోరియన్ హౌస్ విలువ రూ. 8వేల కోట్లు. ఈ ఇంట్లో జిమ్ నుంచి సినిమా థియేటర్ వరకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇల్లు 5 అంతస్తులుండగా ప్రతి అంతస్తులో అన్ని రకాల హై టెక్నాలజీ పరికరాలు అమర్చబడి ఉంటాయి. ఇది ఉక్రెయిన్‌కు చెందిన బిజినెస్ ఉమన్ 'ఎలీనా ఫ్రాంచక్'కి చెందినది.
4. సెవెన్ ది పినాకిల్
అమెరికాలోని మంచు ప్రాంతంలో నిర్మించిన ఈ ఇంటి ధర రూ.77వేల కోట్లు. 123 గదులున్న ఇంట్లో 56 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన స్కీ రిసార్ట్ కూడా ఉంది. ఇక్కడ 10 రాయల్ బెడ్‌రూమ్‌లు, జిమ్, మసాజ్ రూమ్‌లు కూడా ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇద్ర- టిమ్‌లకు చెందినది.
5. మైసన్ డి ఎల్ అమిటీ
ఈ ఇంటిని 2008లో డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేశారు. ఫ్రెండ్‌షిప్ హౌస్‌గా పిలువబడే ఇంటిని అమెరికాలోని పామ్ బీచ్‌లో నిర్మించారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు అమర్చిన ఈ హౌస్.. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించగా దీని ఖరీదు రూ.74 వేల కోట్లు.
6. అమెరికా హాలా రాంచ్
అమెరికాలోని కొలరాడోలో ఉన్న ఈ ఇంటిని సౌదీ అరేబియా సుల్తాన్ 2006లో విక్రయించారు. 15 రాయల్ బెడ్‌రూమ్‌లతో కూడిన ఈ హోమ్ ధర రూ. 67వేల కోట్లు. ఈ ఇంటిని 56 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
7. విల్లా లియోపోల్డా
ఫ్రాన్స్‌లో నిర్మించిన ఈ ఇల్లు రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ ప్రోఖోరోవ్ సొంతం. ఈ ఇంటి ధర రూ. 37వేల కోట్లు. ఈ ఇళ్లు 29 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. ఇందులో 11 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి.
8. పెంట్ హౌస్
ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లోని ఫ్లాట్ల్‌లన్నీ చాలా ఖరీదైనవే. దీని ధర 137 మిలియన్ డాలర్లు.
9. బిల్ గేట్స్ Xanadu
ఇది చాలా సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల ఇంటి జాబితాలో చేర్చబడింది. వాషింగ్టన్‌లో ఉన్న ఈ అందమైన హౌస్‌లో 60 అడుగుల స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇందులో నీటి అడుగున మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. దీని ధర రూ. 1000 కోట్ల పైనే.

