Do this to prevent anyone from watching videos on your phone..!
Not to mention how the use of smartphones has increased in recent times. In this order, the sale of phones will also increase. Smartphone has become a part of human life. If you are awake, you should have your phone in your hand, and if you are sleeping, you should have your phone by your side. Moreover.. Alarm, calendar, watch, camera, calculator, diary.. we look at the smartphone for all these things. Especially in India, as the smartphone usage is increasing day by day, it has become the second largest smartphone market in the world.
మీ ఫోన్‌లోని వీడియోలు ఎవరూ చూడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఏ విధంగా పెరిగిపోయిందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఫోన్ల సేల్ కూడా పెరిగిపోతుంది. ఇక మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైపోయింది. మెలకువగా ఉంటే చేతిలో, నిద్రపోతే పక్కలో ఫోన్ ఉండాల్సిందే. అంతేకాదు.. అలారం, క్యాలెండర్, వాచ్, కెమెరా, కాలిక్యులేటర్, డైరీ.. ఇలా అన్నింటి కోసం మనం స్మార్ట్‌ఫోన్ వంకే చూస్తున్నాం. ఇక ముఖ్యంగా భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌గా అవతరించింది.
ఇవన్నీ పక్కన పెడితే.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లలోని స్టోరేజ్ మెమరీలలో డేటాను వివిధ రకాల ఫార్మాట్‌లలో స్టోర్ చేస్తుంటారు.
అయితే వీడియోలు, ఫోటోలు ఇంకా డాక్యుమెంట్‌ల రూపంలో ఉండే ఈ డేటాను ఇతరులకు కనిపించకుండా చేయలంటే గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న గ్యాలరీ వాల్ట్ -హైడ్ వీడియో & ఆడియో యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోకుంటే సరిపోతుంది.
అలాగే ఈ అప్లికేషన్‌ను వినియోగించుకునే క్రమంలో కొన్ని సూచనలను అనుసరిస్తూ పాసవర్డ్‌ను సెట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత మెమరీలోని వీడియోలను హైడ్ చేసేందుకు సెలక్ట్ చేసుకుని యాప్‌లోని యాడ్ వీడియో ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మరియు ఫోటోలను హైడ్ చేసేందుకు అయితే యాడ్ పిక్చర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మాయమైన అన్ని ఫైళ్లు ఎన్‌క్రిప్షన్ మోడ్‌లో సేవ్ అవుతాయి. దీంతో ఇతరులు మీ ఫోన్‌లోని పర్సనల్ వీడియోలను చూడలేరు.