Central government has given good news to gas consumers
It is known that people from urban areas to rural areas are more and more interested in cooking on gas.
However, these prices are also increasing nowadays. Common people are reaching a situation where they cannot afford them. At the same time, the central government also gave good news to all the gas consumers.
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం
ప్రస్తుత కాలంలో పట్టణాలను మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఎక్కువగా గ్యాస్ పై వంట చేయడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.. తొందరగా వంట పూర్తవడమే కాదు సమయాన్ని కూడా ఆధా చేస్తున్న నేపద్యంలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ స్టవ్ లను ఉపయోగిస్తున్నారు.
అయితే ప్రస్తుత కాలంలో వీటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు వీటిని కొనలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే గ్యాస్ వినియోగదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతూ ఈ పథకం కింద ఎల్పిజి సిలిండర్ ల పై ఇచ్చే రూ.200 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారుగా 9.6 కోట్ల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని కేంద్రమంత్రిఅనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పిజి సిలిండర్ కు రూ.200 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు.
9.6 కోట్ల కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని ఉజ్వల యోజన లబ్ధిదారులకు అందించడానికి 14.2 కిలోల సిలిండర్ పై రెండు వందల సబ్సిడీని ఏడాదికి 12 రీఫిల్స్కు ఆర్థిక వ్యవహారాల సబ్ కమిటీ ఆమోదించిందని ఐ అండ్ బి మంత్రిఅనురాగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మార్చి ఒకటి 2023 నాటికి 9.59 కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. ఈ పథకానికి 2022 2023 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం వ్యయం రూ.6,100 కోట్లు కాగా ఇప్పుడు 2023 - 24 కి గానూ రూ.7,680 కోట్ల ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. మొత్తానికైతే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై గ్యాస్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఊరట.
అధిక ఎల్పీజీ ధరల నుండి వారికి ఉపశమనం కోసం 14.2 కిలోల సిలిండర్ పై ఏడాదికి 12 రిఫిల్ ల వరకు రూ.200 సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
వివరాలు: https://t.co/ccOt6zvkqM#CabinetDecisions #PMUY pic.twitter.com/F6f8EkhOpe
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) March 24, 2023